S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/27/2016 - 11:56

తిరుపతి: మూడు రోజులపాటు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవాలు శుక్రవారం తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టిడిపి అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. త్రీడీ షో, ఫొటో ఎగ్జిబిషన్‌లను ఆయన ప్రారంభించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

05/27/2016 - 11:52

గుంటూరు: ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల అయిదు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుగ్గిరాల మండలం పెరికలపూడిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇళ్లు దగ్ధం కావడంతో బాధితులు రోడ్డున పడ్డారు.

05/27/2016 - 11:51

కర్నూలు: మహానంది వద్ద తెలుగుగంగ కాలువ వద్ద ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. అహోబిలానికి చెందిన అశోక్, రజిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

05/27/2016 - 11:50

విశాఖ: సినీనటుడు అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌లకు సింహాచలంలో శుక్రవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. సింహాచలం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం గాలిగోపురం నుంచి వస్తుండగా వీరు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. గాలిగోపురం నుంచి బయలుదేరిన లిఫ్ట్ కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో అందులో ఉన్న అర్జున్, బోయపాటితో పాటు మరో వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

05/27/2016 - 06:47

విశాఖపట్నం, మే 26: ఇప్పటి వరకు విద్యుత్ వినియోగదారుల కోసం పలు రకాలైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఉద్యోగుల కోసం తొలిసారిగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ‘మై ఈపి’ పేరుతో మొబైల్ యాప్ సౌకర్యాన్ని కల్పించింది. మై ఈపి కొత్త మొబైల్ యాప్‌ను శుక్రవారం సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ టివిఎస్ చంద్రశేఖర్ ప్రారంభించారు.

05/27/2016 - 06:45

తెనాలి, మే 26: ప్రమాదవశాత్తూ చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌లో గురువారం జరిగింది. ముగ్గురు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

05/27/2016 - 06:45

రాజమహేంద్రవరం, మే 26: తూర్పు గోదావరి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వరకు ఎండలు భగభగలాడగా, ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా అంతటా భారీ ఈదురుగాలులు వీచాయి. జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలులు వీచాయి. దీనితోపాటు భారీ వర్షం కురిసింది.

05/27/2016 - 06:19

విజయవాడ, మే 26: భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను పోలీసులు ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమై, శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం, పోలీసులు మెతగ్గా ఉన్నారన్న అభిప్రాయం జనంలో వస్తే, అసాంఘిక శక్తులు విజృంభిస్తాయని అన్నారు.

05/27/2016 - 06:18

విజయవాడ, మే 26: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో వౌలిక వసతులు పక్కాగా లేకపోతే ఆ కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న వసతులు, వౌలిక సదుపాయాల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని అన్నారు.

05/27/2016 - 06:17

విజయవాడ, మే 26: రోహిణీ కార్తె ప్రవేశించడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పుల తాకిడి మరింత పెరగగలదని ప్రజలందరూ భయాందోళన చెందుతున్న తరుణంలో గురువారం సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గన్నవరం విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తుండటంతో స్పైస్‌జెట్ విమానం ల్యాండ్ కావడానికి అనుకూలంగా లేకపోవ డంతో రాజధాని తుళ్లూరు ప్రాంతంలో దాదాపు ఆరేడుసార్లు చక్కెర్లు కొట్టి వెనక్కి వెళ్లిపోయింది.

Pages