S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/25/2016 - 08:33

గంట్యాడ, మే 24: ఓ కుటుంబం విహార యాత్ర విషాదంగా మారి ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది. మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సరదగా జలకాలాటకు జలాశయంలో దిగిన ఒకరు ఊబిలో కూరుకుపోగా వారిని రక్షించేందుకు మరొకరు దిగి అందులో చిక్కుకున్నారు. ఆ ఇద్దరిని కాపాడేందుకు మరొకరు దిగి ఇలా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

05/25/2016 - 08:32

విజయవాడ, మే 24: మూడు నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల సదస్సును బుధ, గురువారాల్లో విజయవాడలో నిర్వహించనుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో ప్రభుత్వం ఏడోసారి కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. స్థానిక అవెన్యూ కళ్యాణ మండపంలో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగబోతోంది. రెండంకెల అభివృద్ధి, పాలనా సంస్కరణలు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరగబోతోంది.

05/25/2016 - 08:31

విశాఖపట్నం, మే 24: దాదాపు తొమ్మిదేళ్లపాటు అండర్ ట్రయర్ ఖైదీగా జైలు జీవితం గడిపిన ఆదివాసీ గిరిజన మహిళ మంగళవారం విడుదల అయ్యారు. పిటి వారెంట్‌తో 46 కేసుల్లో విచారణ నిమిత్తం జైలుకే పరిమితమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వాడరేవులకోట గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ టి.కమలకు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు విడుదలకు ఆదేశం ఇవ్వడంతో ఆమె స్వేచ్ఛ లభించింది.

05/25/2016 - 08:31

కాకినాడ, మే 24: ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల్లో ప్రజాప్రతినిధులు ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని, అలా ఎవరైనా చేస్తే వారి పేరును సంబంధిత ఛార్జిషీటుపై రాయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పోలీసు అధికారులకు సూచించారు. ఇలాంటి కేసుల విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఛార్జిషీటు వెనుకవైపు వారి వివరాలు రాయాలన్నారు.

05/25/2016 - 08:26

తిరుమల, మే 24: శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులు వేచి ఉండేవిధంగా నూతన క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు ఇంజనీరింగ్ అధికారులను మంగళవారం ఆదేశించారు.

05/25/2016 - 08:21

కర్నూలు, మే 24: తుంగభద్ర, కృష్ణా నదీ తీరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దశాబ్దాల తరబడి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుంటే ఓపిక పట్టలేక రైతులు రోడ్డెక్కే పరిస్థితి తలెత్తింది. తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ సమస్య రెండున్నర దశాబ్దాల నుంచి నానుతోంది. ఆ సమస్య పరిష్కారానికి ఇంత కాలం వరకూ ఏలిన ఏ నాయకుడూ చొరవ చూపకపోవడంతో రైతులు యుద్ధానికి సిద్ధపడుతున్నారు.

05/25/2016 - 05:27

గుంటూరు, మే 24: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఎ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజధాని కేంద్రమైన తుళ్లూరు పరిధిలోని వెలగపూడి గ్రామంలో జరుగుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

05/25/2016 - 05:25

గుంటూరు, మే 24: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి రహదారి ఏర్పాటుకాలేదు. చిత్తడి నేల కావడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సచివాలయం వరకు వెళ్లాలంటే అవస్థలు తప్పటంలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే ఈ అనుభవం ఎదురైంది.

05/25/2016 - 05:17

గాజువాక (విశాఖ), మే 24: విశాఖపట్నం జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో శ్రీకర్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇస్సాయి రామకృష్ణ (26) మృతి చెందగా, కె శ్రీనివాసరావు, సింహాద్రితోపాటు మహిళా కార్మికురాలు సరోజిని నాయుడు తీవ్రం గా గాయపడ్డారు.

05/25/2016 - 05:11

కడప, మే 24: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను అడ్డుకునే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేవని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతిపరుల కొమ్ముకాస్తూ బాబు ప్రగల్భాలు పలుకుతున్నారని దుమ్మెత్తిపోశారు. కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం పలు ప్రారంభోత్సవాలు చేశారు.

Pages