S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/24/2016 - 11:57

విజయవాడ: ఈ ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి కావాలని ఎపి సిఎం చంద్రబాబు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం ఉదయం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. నగరంలో ఫ్లయ్ ఓవర్ పనులను వేగవంతం చేయాలన్నారు.

05/24/2016 - 11:56

గుంటూరు: వెలగపూడిలో చేపట్టిన తాత్కాలిక సచివాలయం పనులను ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణాల తీరుతెన్నులను గురించి అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. నిర్ణీత సమయానికి తాత్కాలిక సచివాలయం పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు. మంత్రులు దేవినేని, నారాయణ తదితరులు సిఎం వెంట ఉన్నారు.

05/24/2016 - 04:01

కోసిగి, మే 23: పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోని బురదలో దిగబడి ఊపిరాడక నలుగురు బాలురు మృతిచెందిన సంఘటన సోమవారం కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో చోటుచేసుకుంది. 8 నుంచి 12 ఏళ్ల వయసు కల్గిన ఆరుగురు బాలురు ఇంటి వద్ద మధ్యాహ్నం భోజనం చేసి ఈత కొట్టేందుకు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న బుగేనిచెరువుకు వెళ్లారు.

05/24/2016 - 04:00

హైదరాబాద్, మే 23: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షా ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం విడుదల చేయనున్నారు. సచివాలయంలో మంత్రి చాంబర్‌లో ఉదయం 10 గంటలకు ఫలితాలను మంత్రి విడుదల చేస్తారు.

05/24/2016 - 03:59

హైదరాబాద్, మే 23: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,69,547 మంది హాజరుకానున్నారు. ఇందులో ఫస్టియర్ 3,49, 664 మంది, సెకండియర్ విద్యార్థులు 1,19,883 మంది రాస్తున్నారు. ఇందులో బాలురు 2,57,546 మంది కాగా బాలికలు 2,12,001 మంది ఉన్నారు.

05/24/2016 - 03:59

హైదరాబాద్, మే 23: ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పరాంకుశం వేణుగోపాల్ రాజీనామా వ్యవహారం న్యాయ సంస్థలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం దీనిపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన కొద్ది గంటలకే వేణుగోపాల్ హైకోర్టులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేయటం మరిన్ని ఊహాగానాలకు దారితీసింది.

05/24/2016 - 03:57

విజయవాడ, మే 23: అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌ను తన చేతకాని తనంతో ముఖ్యమంత్రి థార్ ఎడారిగా మారుస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న చంద్రబాబు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ప్రధాని మోదీలను తరిమికొట్టి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

05/24/2016 - 03:55

విశాఖపట్నం, మే 23: చట్టసభల్లో సభ్యులు సత్‌ప్రవర్తన, విలువలతో మెలుగుతూ నియమావళి పాటించి ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ చక్రపాణి ఉద్బోధించారు. ‘చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన- నైతిక విలువల ఆచరణ’ అనే అంశంపై ఎథిక్స్ కమిటీ ఆధ్వర్యంలో తొలి సదస్సు విశాఖలో సోమవారం జరిగింది. ఈ సదస్సులో చక్రపాణి మాట్లాడుతూ చట్టాలకు రూపకల్పన చేసే సభ్యులే విలువలను పాటించకపోవడం బాధాకరమన్నారు.

05/24/2016 - 03:52

గుంటూరు, మే 23: రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు దగాపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు చెల్లించక పోవటంతో అటు పంటలకు నోచుకోక, ఇటు నష్టపరిహారం అందక విలవిల్లాడుతున్నారు. భూసమీకరణలో భాగంగా ప్రభుత్వం జరీబు రైతులకు ఎకరానికి రూ. 50వేలు, మెట్టపొలం ఎకరానికి రూ. 25వేలు ఏటా 10శాతం పెంపుదలతో పదేళ్లపాటు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది.

05/24/2016 - 03:50

ఏలూరు, మే 23 : పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్‌లో సోమవారం ఒక వ్యక్తి వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామ సర్పంచ్ భర్త కావడం గమనార్హం. వివరాలిలావున్నాయి...

Pages