S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/24/2016 - 03:48

నెల్లూరుటౌన్, మే 23: జూలైలోపు అమరావతికి మంత్రులు, ఉద్యోగులు తరలి రానున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని కస్తూర్బాదేవి గార్డెన్స్‌లో టిడిపి జిల్లా మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మినీమహానాడులో అమరావతిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై మాట్లాడారు.

05/24/2016 - 03:40

విజయవాడ, మే 23: ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఖజానాకు భారీగా గండి పడబోతోంది. కొన్ని తొందరపాటు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మించాలన్న ఆతృతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను వదిలి బయటకు రావడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

05/24/2016 - 03:40

ప్రత్తిపాడు, మే 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు ప్రకటిస్తున్న కానుకల్లో చంద్రన్న భజన ఎందుకని మాజీ మంత్రి, కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. కాపు భవన్‌కు చంద్రన్న పేరు పెడుతూ ప్రభుత్వం ఇచ్చిన జిఓలో ఆ పేరును తొలగించాలని కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, యువత డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ముద్రగడ లేఖ రాశారు.

05/24/2016 - 03:38

విశాఖపట్నం, మే 23: ఈస్ట్ విశాఖ జాయింట్ డివిజన్ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు సహా మరో ముగ్గురు మిలీషియా సభ్యులను విశాఖ రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

05/24/2016 - 03:37

కాకినాడ, మే 23: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న కాపు సంక్షేమ భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును పెట్టడంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. కాపు సంక్షేమ భవనాలకు చంద్రన్న పేరు పెట్టడం సబబేనన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని సోమవారం జరిగిన మినీ మహానాడులో ఆయన ప్రసంగించారు.

05/24/2016 - 03:36

కడప, మే 23 : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారారని, ముఖ్యంగా తన ఉనికిని చాటుకునేందుకు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

05/24/2016 - 03:36

అనంతపురం, మే 23: అనంతపురం జిల్లాలో దందాలు, కిడ్నాప్‌ల పర్వం మళ్లీ మొదలైంది. నగరంలో ఉన్న ఆడిటర్ ఆనందరెడ్డి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేయాలన్న లక్ష్యంతో 13 మంది సభ్యులుతో కూడిన ముఠా పథకం పన్నింది. ఈ మేరకు ఆడిటర్‌కు స్నేహితుడు, రెండు దశాబ్దాల క్రితం కారు బాంబు కేసు ఫిర్యాదుదారుడైన రాజారెడ్డిని గత నెల 12వ తేదీ రాత్రి నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న అతడి ఇంట్లో భార్యా పిల్లలతో ఉండగా కిడ్నాప్ చేశారు.

05/24/2016 - 03:35

విజయవాడ, మే 23: తిరుపతిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుతో 27 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 13 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి ఎనిమిది తీర్మానాలు ఉన్నాయి. ఐదు ఉమ్మడి తీర్మానాలు, ఒక రాజకీయ తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఇక్కడ పార్టీ నాయకులతో చర్చించారు.

05/24/2016 - 03:35

విజయవాడ, మే 23: కృష్ణాడెల్టా ఆయకట్టు పరిధిలో మంచినీటి అవసరాల కోసం ఈ నెల 17న మధ్యాహ్నం నాగార్జునసాగర్ జలాశయం నుంచి విడుదల చేసిన నీరు సోమవారం సాయంత్రం నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. బ్యారేజీకి కనీసం నాలుగు టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు అనుమతినిచ్చిందని తొలుత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.

05/24/2016 - 03:34

విజయవాడ, మే 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కాపు నాయకుడు ముద్రగ పద్మనాభం రాసిన లేఖపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన ఇక్కడ ఒక లేఖను విడుదల చేశారు. నెలకో లేఖ, పక్షానికో ప్రెస్‌మీట్ ద్వారా ముద్రగడ జగన్ అజెండాను కాపుల మీద రుద్దడం బాధాకరమని నారాయణ విమర్శించారు. మంజునాథ కమిషన్ పని ప్రారంభించిన తరుణంలో లేఖ రాయడం కాపుల్లో అయోమయాన్ని సృష్టించడమే అవుతుందన్నారు.

Pages