S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/24/2016 - 03:33

కాకినాడ, మే 23: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రాజెక్టుల మోక్షం కలుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, త్వరలో గోదావరి-ఏలేరు నదులను అనుసంధానిస్తామని చెప్పారు.

05/23/2016 - 18:18

కాకినాడ: ఇక్కడి ప్రిజమ్ కళాశాలలో సిఎ చదువుతున్న సాయికుమార్ అనే విద్యార్థి ఉరి వేసుకుని మరణించినట్లు సోమవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ప్రేమ వ్యవహారంలో విఫలం కావడంతో విశాఖకు చెందిన ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ర్యాగింగ్ వల్ల ఇతను మరణించినట్లు తొలుత వార్తలు వ్యాపించాయి.

05/23/2016 - 17:36

విజయవాడ: సాంకేతికతలో అగ్రభాగాన నిలిచిన జపాన్ సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ప్రగతి సాధిస్తుందని సిఎం చంద్రబాబు అన్నారు. జపాన్ ప్రతినిధులతో సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎపిని పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాల సహకారం ఇవ్వాలని కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రెండో టోక్యోగా భావించాలని ఆయన జపాన్ ప్రతినిధులను కోరారు.

05/23/2016 - 17:36

రాజమండ్రి: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత సాధించేందుకు ఈనెల 30న చిత్తూరు జిల్లా నారావారిపల్లె నుంచి మాదిగ దండోరా యాత్ర ప్రారంభిస్తామని ఎమ్మార్పీస్ నేత మందకృష్ణ సోమవారం తెలిపారు. గతంలో పోలీసుల ఆంక్షల కారణంగా యాత్రను వాయిదా వేసినట్టు తెలిపారు. మరికొన్ని ఇతర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చితే తాము సహించేది లేదన్నారు.

05/23/2016 - 17:35

కాకినాడ: ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి వచ్చే నెల 21 నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ పాలన జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సిఎం చినరాజప్ప సోమవారం తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాగా, ఈనెలాఖరులో తిరుపతిలో జరిగే టిడిపి మహానాడుకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

05/23/2016 - 17:34

ఏలూరు: ఎపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, నవ్యాంధ్రకు మెరుగైన రాజధానిని నిర్మించాలని గతంలో గొప్పగా చెప్పిన బిజెపి నేతలు ఆ మాటల్ని నేడు మార్చడం సరికాదని ఎపి మంత్రి అయ్యన్న పాత్రుడు సోమవారం ఇక్కడ అన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను, విభజన చట్టంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు.

05/23/2016 - 17:34

విజయవాడ: ఎపిలో పరిశ్రమలు రాకుండా వైకాపా అడ్డుపడుతోందని రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు సోమవారం ఇక్కడ ఆరోపించారు. లేనిపోని దీక్షలతో ప్రశాంత వాతావరణాన్ని వైకాపా అధినేత జగన్ చెడగొడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రాజెక్టులపై జగన్ దిల్లీ వెళ్లి దీక్షలు చేస్తే ఫలితం ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.

05/23/2016 - 17:33

హైదరాబాద్: యమునోత్రి యాత్రకు దక్షిణ కాశీ వెళ్లిన తెలుగువారంతా క్షేమంగానే ఉన్నారని, ఈ విషయమై దక్షిణ కాశీ కలెక్టర్‌తో మాట్లాడి అన్ని వివరాలూ తెలుసుకున్నానని ఎపి సమాచార, ఐటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఇక్కడ తెలిపారు. యాత్రీకలు సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకునేలా దిల్లీలోని ఎపి భవన్ అధికారులు కూడా సేవలందిస్తున్నారని ఆయన చెప్పారు.

05/23/2016 - 17:32

కాకినాడ: ఇక్కడి ట్రిజమ్ సిఎ కళాశాలలో సాయికుమార్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సోమవారం వెలుగు చూసింది. ఉరి వేసుకుని ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ర్యాగింగే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

05/23/2016 - 15:04

విజయవాడ: గౌహతిలో ఈనెల 24న జరిగే అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపి సిఎం చంద్రబాబు హాజరవుతారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ బాబుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాబోయే సిఎం సోనోవాల్ నుంచి ఆహ్వానం అందింది.

Pages