S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/23/2016 - 15:04

విజయవాడ: ఈ నెల 26న ఇక్కడ జరగాల్సిన ఎపి మంత్రిమండలి భేటీని జూన్ 1వ తేదీకి వాయిదా వేశారు. అలాగే, ఈ నెల 24, 25 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సమావేశాన్ని 25,26వ తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24న అస్సాం ముఖ్యమంత్రిగా శర్వానంద సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేస్తున్నందున సిఎం చంద్రబాబు గౌహతి వెళతారు.

05/23/2016 - 15:02

విజయవాడ: తెలంగాణలో అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిరసనగా సోమవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించిన సందర్భంగా ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి అలంకార్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

05/23/2016 - 15:01

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆందోళన వ్యక్తం చేసేందుకు సోమవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.

05/23/2016 - 12:46

గుంటూరు: మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను సోమవారం ఉదయం ఇక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఎపి కాంగ్రెస్ కమిటీ చేపట్టే ఆందోళనకు ఆయన హాజరు కావల్సి ఉంది. అయితే, ఆయనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.

05/23/2016 - 12:45

విశాఖ: మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వసంత ఎలియాస్ జ్యోతిని విశాఖ మన్యంలో అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సోమవారం ప్రకటించారు. ఆరు హత్యలతో పాటు మొత్తం 51 కేసుల్లో నిందితురాలైన వసంతపై పోలీసు శాఖ గతంలోనే నాలుగు లక్షల రివార్డు ప్రకటించింది. ఆమెతో పాటు మావోయిస్టు పార్టీ మిలీషయా సభ్యులైన ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

05/23/2016 - 12:44

కాకినాడ: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్లపై తీర్మానాన్ని ఆమోదించి పార్లమెంటుకు పంపాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ చంద్రన్న పేరు పెట్టడం సరికాదన్నారు.

05/23/2016 - 12:44

విజయవాడ: జపాన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు సోమవారం ఉదయం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు వారు సిఎంతో చర్చలు జరిపారు. భవిష్యత్‌లో ఎపి రాజధాని అమరావతి నుంచి జపాన్ రాజధాని టోక్యోకు విమాన సర్వీసులు నడుపుతామని చంద్రబాబు చెప్పారు.

05/23/2016 - 12:43

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా నారాయణపురంలో సోమవారం ఉదయం క్షుద్రపూజలపై పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. క్షుద్రపూజల కారణంగా ఈ ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని పోలీసులు తెలిపారు.

05/23/2016 - 12:42

కర్నూలు: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్‌డిఎస్) ఆనకట్ట వద్ద సోమవారం ఉదయం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కోసిగి మండలం బొమ్మనాపల్లి వద్ద ఎమ్మెల్యే ఆందోళనకు దిగడంతో ఆర్‌డిఎస్ వివాదం మళ్లీ రాజుకుంది.

05/23/2016 - 08:30

హైదరాబాద్, మే 22: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వారికి సురక్షితమైన మంచినీరు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 66 సోలార్ ఆధారిత డ్యూయల్ పంప్‌పైప్ వాటర్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Pages