S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/23/2016 - 08:29

హైదరాబాద్, మే 22: మచిలీపట్నం రేవు బాలారిష్టాలను అధిగమించింది. ఈ పోర్టును రూ. 11,900 కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి చర్చించి ప్రకటన చేయనున్నారు.

05/23/2016 - 08:17

అనంతపురం, మే 22: రాజస్థాన్‌లో తాను చూసిన పరిస్థితులే అనంతపురం జిల్లాలో కూడా ఉన్నాయని, అయితే ఇక్కడ రాజస్థాన్ కంటే 3 రెట్లు అధికంగా వర్షపాతం నమోదవుతోందని ఉత్తరప్రదేశ్ రాజ్‌పుత్ వంశస్థుడు, ఆయుర్వేద వైద్యుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ పేర్కొన్నారు.

05/23/2016 - 08:16

కాకినాడ, మే 22: గవర్నమెంట్ రేటు ఆధారిత పన్ను మదింపు విధానాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో అమలుచేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి ఉపకరించే పన్నుల సేకరణ ప్రక్రియను సమర్ధవంతంగా అమలుచేయడానికి గవర్నమెంట్ రేటు పన్ను మదింపు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ఈ విధానం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం విజయవంతంగా అమలుజరుగుతోంది.

05/23/2016 - 08:15

కూచిపూడి, మే 22: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని విస్మరించటం పట్ల తెలుగు భాషాభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

05/23/2016 - 08:14

కర్నూలు, మే 22: జలాల వినియోగంలో మూడు రాష్ట్రాలు చర్చల ద్వారా సర్దుబాటు దోరణితో ముందుకుపోతే మంచిదని, లేనిపక్షంలో ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

05/23/2016 - 08:09

విజయవాడ, మే 22: విజయవాడ నడిబొడ్డులో ఆంధ్రప్రదేశ్‌కి గర్వకారణంగా నిలిచే నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పుడున్న స్వరాజ్య మైదానంలో విజయవాడ సిటీ స్క్వేర్‌ను నిర్మిస్తారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటైన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నమూనాను ధ్రువీకరించారు. చైనీస్ సంస్థ జీఐసిసి ఈ నమూనాకు రూపకల్పన చేసింది.

05/23/2016 - 08:06

కడియం, మే 22: ‘పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే’ అనే సామెత ఊరికే వచ్చినట్టు లేదు. ఎందుకంటే మూడు పులస చేపలు ఏకంగా 25వేలకు అమ్ముడు బోయాయ. వరదల సమయంలో మాత్రమే లభించే ఈ పులసలు ఆదివారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మత్స్యకారులకు చిక్కాయి. రెనో తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆనకట్ట దిగువన ఉన్న నీటి నుండి కొన్ని చేపలు లభించినట్టు మత్స్యకారులు చెబుతున్నారు.

05/23/2016 - 01:29

విజయవాడ, మే 22: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి హైదరాబాద్‌లో ఎక్కడా పొంతనలేని విధంగా ఎడబాటుగా ఉంటూ వస్తున్న సచివాలయం సిబ్బంది, డైరెక్టరేట్ కార్యాలయాల సిబ్బందిని తొలిసారిగా అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయంలో ఒకే గొడుగు కిందకు తీసుకురావటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

05/22/2016 - 16:20

కోల్‌కత:పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆ పార్టీ ప్రధాని మోదీని ఆహ్వానించింది. యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సహా పలువురు ప్రముఖులను ఆమె ఆహ్వానించారు. ఈనెల 27న మమత బాధ్యతలు స్వీకరించనున్నారు.

05/22/2016 - 16:19

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ రాజీనామా చేశారు. కొన్ని కారణాలవల్ల ఆయనను రాజీనామా చేయాల్సిందిగా ప్రభుత్వం కోరడంతో ఆయన ఆ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అదనపు ఏజీగా పనిచేస్తున్నవారికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Pages