S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/22/2016 - 16:18

ఒంగోలు:ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం జరిగిన మినీ మహానాడు సందర్భంగా పార్టీకి చెందిన కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గాల మధ్య బహిరంగంగా జరిగిన ఘర్షణపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహ వ్యక్తం చేశారు. విభేదాలుంటే పార్టీలో చర్చించాలే తప్ప ఇలా బహిరంగ వేదికలపై రచ్చ చేయకూడదని అన్నారు. పార్టీకోసం అవసరమైతే కొందరిని వదులుకుంటానని హెచ్చరించారు.

05/22/2016 - 16:17

న్యూదిల్లి:దిల్లీ శాసనసభకు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులుకానున్నారు. ఈ మేరకు రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు.

05/22/2016 - 06:52

చిలకలూరిపేట, మే 21: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లైనా రుణాలు మాఫీ చేయక పోవడంతో తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయంటూ కౌలురైతులు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాసాన్ని శనివారం ముట్టడించారు.

05/22/2016 - 06:50

విజయవాడ, మే 21: తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విలీన మండలాల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. చింతూరు మండలం చట్టి ఎంపిటిసి, ఎటపాక మండల జడ్పీటిసి, ఎటపాక ఎంపిపి స్థానాలకు ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు.

05/22/2016 - 06:49

ఏలూరు, మే 21 : హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉద్యోగులు తరలి రావడంలో అనేక సమస్యలు వున్నప్పటికీ రాష్ట్భ్రావృద్ధి కోసం తరలి వస్తున్నామని ఎపి ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్‌బాబు అన్నారు.

05/22/2016 - 06:47

గుంటూరు, మే 21: మూడు రోజుల నవజాత శిశువుకు శస్తచ్రికిత్స చేసి వైద్యులు ప్రాణాలు కాపాడారు. ఒంగోలుకు చెందిన మూడు రోజుల శిశువుకు పుట్టుకతోనే గుండెజబ్బు ఉందని గుర్తించిన అక్కడి వైద్యులు గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సిఫార్సు చేశారు.

05/22/2016 - 06:45

చింతూరు, మే 21: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మన్యంలో మావోయిస్టులు పోలీసు బలగాలే లక్ష్యంగా మందుపాతరలను అమర్చుతూ కలకలం సృష్టిస్తున్నారు. గత 13వ తేదీన ఏడుగుర్రాలపల్లి గ్రామ సమీపంలోని రేగులపాడు గుంపులో మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. మళ్లీ శనివారం ఏడుగుర్రాలపల్లి సంత సమీపంలోని మామిడిచెట్టు కింద మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు గుర్తించారు.

05/22/2016 - 06:42

కాకినాడ, మే 21: కుల వివాదంలో ఇరుక్కున్న అరకు ఎంపి కొత్తపల్లి గీత శనివారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి స్క్రూట్నీ కమిటీ నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. ఈమె ఎస్టీ (గిరిజన కులం) కాదంటూ న్యాయస్థానంలో ప్రత్యర్ధులు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశంపై విచారణకు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ అధ్యక్షతన స్క్రూట్నీ కమిటీ సమావేశం అయ్యింది.

05/22/2016 - 06:40

ఆదోని, మే 21: కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర డ్యాంకు పూడిక ముప్పు పొంచి ఉంది. డ్యాంలో రోజురోజుకూ పూడిక పేరుకుపోవడంతో నీటి మట్టం సామర్థ్యం తగ్గిపోతోంది. అంతేకాకుండా పూడిక పెరగడంతో రాష్ట్రాల వాటా తగ్గిపోయి మూడు రాష్ట్రాలకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. డ్యాం పూర్తి స్థాయిలో నిండినప్పటికీ ఆ నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఉంది.

05/22/2016 - 06:36

హైదరాబాద్, మే 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు పునర్విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని జన చైతన్య వేదిక డిమాండ్ చేసింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.

Pages