S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/22/2016 - 05:53

ఒంగోలు,మే 21: ప్రకాశం జిల్లా ఒంగోలులో టిడిపి మినీమహానాడు రచ్చయంది. కరణం బలరాం, గొట్టిపాటి వర్గీయులు మధ్య తోపులాట, పార్టీ పరిశీలకులు బుచ్చయ్యచౌదరి గన్‌మెన్‌ను బలరాం నెట్టడటంలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం జిల్లాపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ అధ్యక్షతన జరిగింది.

05/22/2016 - 05:52

విశాఖపట్నం, మే 21: తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కుకు తాజా వర్షాలు ఊపిరి పోశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు గోదావరి నుంచి గ్రావిటీ ద్వారా ఏలేరు కాలువ నుంచి 100 మిలియన్ గేలన్స్ పర్‌ఎడే (ఎంజిడి)ల నీరు అదనంగా వచ్చి చేరింది. దీంతో ఇప్పకే నిలిపివేసిన కొన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తిని పునః ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

05/22/2016 - 05:52

విజయనగరం, మే 21: రోజూ కోర్టులకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే నేతలు టిడిపికి అవసరం లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. తప్పులు ఎవరో చేస్తే శిక్షలు అధికారులకు అనే విధానం టిడిపి ప్రభుత్వంలో ఉండదన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

05/22/2016 - 05:51

హైదరాబాద్, మే 21: తీవ్రవాదాన్ని సమూలంగా అణచి వేసినప్పుడే దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఎపి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు అన్నారు. శనివారం రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా ఎపి కాంగ్రెస్ కార్యాలయమైన ఇందిరా భవన్‌లో రాజీవ్ చిత్ర పటానికి కెవిపి పూలదండ వేసి నివాళి అర్పించారు.

05/22/2016 - 05:50

హైదరాబాద్, మే 21: వైకాపా నేతలు డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణలోని ప్రాజెక్టుల కాంట్రాక్టర్లుగా వైకాపా నేతలు ఉన్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలు విచారకరమని వైకాపా సీనియర్ నేత, శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

05/22/2016 - 05:50

హైదరాబాద్, మే 21: తుపాను,ప్రకృతివైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా విశాఖపట్నంలో రూ. 600 కోట్ల వ్యయంతో భూగర్భ విద్యుత్ పంపిణీ వ్యవస్ధను ఏర్పాటు చేయనున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో తుపాను గాలుల వల్ల అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్ధపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమీక్షించారు. అనంతరం అజయ్ జైన్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు రూ.

05/22/2016 - 05:47

పిలిభిత్, మే 21: విజయ్ మాల్యా అంటే ఎవరో పాపం ఆ రైతుకు తెలియదు. అయినా సరే బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని ఎగవేయడంతో పాటుగా, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న మాల్యాకు ‘గ్యారంటీర్’గా నిలిచినందుకు ఆ రైతు బ్యాంక్ ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు.

05/22/2016 - 05:37

విజయవాడ, మే 21: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో విదేశాలలోని తెలుగువారిని భాగస్వాముల్ని చేయటమే గాక స్వస్థలాలకు వచ్చినపుడు వారు ఎలాంటి సమస్య ఎదుర్కోకుండా తగిన విధంగా సహాయపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపిఎన్నార్టీ సొసైటీ) సిఇఓ డా.రవికుమార్ వేమూరు తెలిపారు.

05/22/2016 - 05:35

విశాఖపట్నం, మే 21: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తీవ్ర తుపాను శనివారం సాయంత్రం 3.30 గంటలకు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వద్ద తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఐజ్వల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమై ఉంది. ఆ తరువాత దక్షిణ నైరుతి దిశగా కదులుతూ బలహీన పడుతుందని తెలిపారు.

05/22/2016 - 05:34

అనకాపల్లి, మే 21: ఆగివున్న లారీని ఢీకొట్టిన సంఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం ఆరిలోవకు చెందిన మామా అల్లుళ్లు ఏలూరు వెళ్లి వస్తూ ఈ సంఘటనలో దుర్మరణం చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న విశాఖపట్నానికి చెందిన మరో ఇద్దరు కూడా మృతి చెందారు.

Pages