S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/22/2016 - 05:34

రాజమహేంద్రవరం, మే 21: ప్రపంచంలోనే ఏ నదికీ లేనివిధంగా ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు గోదావరి నదికి అంత్య పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కౌన్సిల్ సమావేశం ఈమేరకు తీర్మానించింది.

05/22/2016 - 05:33

నెల్లూరు, మే 21: నెల్లూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసాభాసగా మారాయి. పోలింగ్ ప్రారంభం కాకముందే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బ్యాలెట్ పేపరుపై అంకెలు వేయడంతో తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల అధికారి కమిషనర్ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారమే పోలింగ్ జరుపుతున్నామని చెప్పడంతో దీనిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండిపడ్డారు.

05/21/2016 - 18:29

విజయవాడ: పేదరికంలో పుట్టిన తాను పేద ప్రజలకు డాక్టర్‌గా సేవలందిస్తానని ఎపి ఎంసెట్ మెడికల్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత చెబుతోంది. చదువంటే తనకెంతో ఇష్టమని అందుకే కష్టపడి ఈ ర్యాంకును సాధించానని ఆమె అంటోంది. ఆమె తండ్రి వీరన్న కర్నూలులోని ఓ బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి కళావతి గృహిణి. ఈ దంపతులకు ముగ్గురూ ఆడపిల్లలే.

05/21/2016 - 18:26

గుంటూరు: నిజాంపట్నం ఓడరేవు నుంచి ఈనెల 16న సముద్రంపైకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. వారు వేటకు వెళ్లిన తర్వాత బంగాళాఖాతంలో తుపాను ఏర్పడింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచాయి. తుపాను సమయంలో వీరు సముద్రంలో కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

05/21/2016 - 17:17

శ్రీకాకుళం: ఎపికి ప్రత్యేక హోదా సాధించేలా రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు కేంద్రంపై నిత్యం ఒత్తిడి తేవాలని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. టిడిపి కూడా ఈ విషయమై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. హోదాపై కాంగ్రెస్, వైకాపా నేతలు ఇష్టానుసారం మాట్లాడడం తగదన్నారు.

05/21/2016 - 17:15

ఒంగోలు: ఇక్కడ శనివారం ప్రారంభమైన టిడిపి మినీ మహానాడు సభలో ఆ పార్టీకి చెందిన కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పార్టీ పరిశీలకుడిగా వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరువర్గాలను శాంతింపజేశారు. మంత్రులు రావెల కిశోర్‌బాబు, శిద్ధా రాఘవరావు పాల్గొన్నారు.

05/21/2016 - 17:14

కడప: వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య 408వ జయంతి సందర్భంగా రాజంపేట మండలం తాళ్లపాకలో శ్రీవారి కల్యాణం నిర్వహించారు. టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

05/21/2016 - 17:13

విజయవాడ: ఎపి ఎంసెట్ మెడికల్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు సాధించిన కర్నూలు జిల్లాకు చెందిన హేమలతను సిఎం చంద్రబాబు అభినందించారు. శనివారం మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను ప్రకటించిన సందర్భంగా విజయవాడలో ఉన్న హేమలత సిఎంను కలవగా ఆయన అభినందించారు.

05/21/2016 - 12:46

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని వారే తనకు స్వయంగా చెప్పారని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగుల కోసం తాత్కాలిక రాజధాని పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక సౌకర్యాలన్నింటినీ కల్పిస్తామన్నారు.

05/21/2016 - 12:46

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయడం వల్ల ఈ ఏడాది ‘నీట్’ నుంచి మినహాయింపు లభించిందని, అయితే వచ్చే ఏడాది నుంచి ‘నీట్’ తప్పకపోవచ్చని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం ఇక్కడ ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ, నీట్ పరీక్షకు విద్యార్థులు ఇప్పటి నుంచే సర్వసన్నద్ధం కావాలన్నారు.

Pages