S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/21/2016 - 16:44

గుంటూరు: రేపల్లె మండలం చోడాయపాలెంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాల్మన్ రాజు అనే బాలుడు చివరకు శవమై కనిపించాడు. మోర్తోట వద్ద కృష్ణానదిలో గురువారం ఉదయం బాలుడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. కాగా, ఈ బాలుడి అదృశ్యానికి సంబంధించి బంధువులు నిలదీయడంతో మనస్తాపం చెందిన కృష్ణ అనే యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

04/21/2016 - 16:43

ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని, రూ.2500 కోట్ల ఆదాయం వస్తుందని పోలవరం అథారిటీ సీఈవో అమర్‌నాథ్‌సింగ్ తెలిజయేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై పోలవరం సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించిన కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది.

04/21/2016 - 14:55

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలకు నిరసనగా ఈనెల 23న అన్ని జిల్లాల్లోనూ కొవ్వొత్తుల ర్యాలీలు జరపాలని వైకాపా నిర్ణయించింది. కరవు, నీటి సమస్యపై మే 2న మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని వైకాపా నేత బొత్స సత్యనారాయణ గురువారం తెలిపారు. విశాఖలో టిడిపి యువనేత లోకేష్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు.

04/21/2016 - 14:53

అనంతపురం: దివంగత టిడిపి నేత పరిటాల రవి శిలావిగ్రహాన్ని ఆయన స్వగ్రామమైన వెంకటాపురంలో గురువారం ఎపి సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రవి జ్ఞాపకార్థం 250 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత, టిడిపి నేతలు పాల్గొన్నారు.

04/21/2016 - 14:52

కాకినాడ: ఎపి అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆ పదవిని త్వరలోనే కోల్పోవడం తథ్యమని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మీడియా సమావేశంలో జోస్యం చెప్పారు. జగన్ నిరంకుశ వైఖరి నచ్చకే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని, ఈ వలసలు ఇంకా ఎక్కువై ప్రతిపక్ష నేత హోదాను జగన్ కోల్పోకతప్పదన్నారు.

04/21/2016 - 14:52

కడప: వైకాపా అధినేత వైఎస్ జగన్ గురువారం ఉదయం ఒంటిమిట్టలోని కోదండరామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. బుధవారం రాత్రి జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో సిఎం చంద్రబాబు దంపతులు, గవర్నర్ నరసింహన్ పాల్గొనగా, ఈరోజు జరిగిన రథోత్సవంలో జగన్ పాల్గొన్నారు.

04/21/2016 - 14:51

విశాఖ: విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ కె.ప్రవీణ్ సమక్షంలో గురువారం ఉదయం మావోయిస్టు పార్టీ సభ్యురాలు ఝాన్సీ, మిలీషియా సభ్యులు లక్ష్మయ్య, అప్పారావు లొంగిపోయారు. ఝాన్సీపై పోలీసులు ఇదివరకే 4 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.

04/21/2016 - 14:51

అనంతపురం: జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర ట్రస్టు గురువారం వెంకటాపురంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు ఎపి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. దాంపత్యబంధంతో ఒక్కటైన 250 జంటలను ఆయన ఆశీర్వదించారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, టిడిపి నేత పయ్యావుల కేశవ్ తదితరులు హాజరయ్యారు.

04/21/2016 - 12:20

గుంటూరు: మద్యం తాగిన కొద్ది సేపటికే ఇద్దరు మరణించిన ఘటన అమరావతి మండలం పునుగోడులో గురువారం ఉదయం జరిగింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కాటంరాజు (55), నీలయ్య (36) మద్యం సేవించి కాసేపటికే అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరూ మరణించారు. వీరు అతిగా తాగడం వల్ల మరణించరా? లేక మద్యంలో కల్తీ జరిగిందా? అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

04/21/2016 - 12:19

అనంతపురం: ఎపి మంత్రి పరిటాల సునీత ఈరోజు 250 జంటలకు సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. రామగిరి మండలం తిరుమల దేవర ఆలయంలో ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కరవుతో అలమటిస్తున్న గ్రామీణ ప్రాంత వాసులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఉచిత వివాహాలను పరిటాల కుటుంబం ఏటా నిర్వహిస్తోంది.

Pages