S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/29/2016 - 02:18

విజయవాడ, మార్చి 28: రాజధాని నిర్మాణంలో తలమునకలై ఉన్న సిఆర్‌డిఏ మరోవైపు కేసులపై కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సోమవారం హైకోర్టులో ఒక కేసు దాఖలైంది. నెలకు లక్షా 20వేల రూపాయల జీతంపై వివిధ రంగాల్లో ప్రతిభావంతుడైన గుంటూరుకు చెందిన పత్రి వాసుదేవన్‌కు కమ్యూనికేషన్ విభాగంలో జెడి పోస్టు లభించింది. అన్నిరకాల పరీక్షలు, ఇంటర్వ్యూల అనంతరం ఈ నెల 8న నియామక పత్రం కూడా అందజేశారు.

03/29/2016 - 02:17

కాకినాడ, మార్చి 28: ఇంతవరకు పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేడు అదే పథకానికి జైకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా రాజకీయ మహిమగా గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు చెప్పుకుంటున్నారు. పట్టిసం నిర్మాణం వలన గోదావరి జిల్లాల రైతులు, ప్రజలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని జ్యోతుల నెహ్రూ గతేడాది ఉద్యమాన్ని ప్రారంభించారు.

03/29/2016 - 02:15

కదిరి, మార్చి 29 : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం (తేరు) సోమవారం భక్తుల గోవిందనామస్మరణ మధ్య తిరువీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మరథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తరలివచ్చారు.

03/29/2016 - 00:49

హైదరాబాద్, మార్చి 28: పదవులకు ఆశపడి తాను వైకాపాను వీడడం లేదని, ఆ పార్టీ విధానాలపై తనకు అసంతృప్తిగా ఉందని, నియోజకవర్గం కార్యకర్తలతో మాట్లాడి వారి ఆకాంక్ష మేరకు తాను పార్టీ మారనున్నట్లు వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ తన ఇంట్లో విలేఖర్లతో ముచ్చటిస్తూ పిఏసి చైర్మన్ పదవి రాలేదనే అసంతృప్తితో తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన సమాచారంలో నిజంలేదన్నారు.

03/28/2016 - 18:08

విజయనగరం: మహిమగల పాత్రలంటూ ప్రజలను మోసగిస్తున్న నలుగురు సభ్యులున్న ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్.కోటలో మహిమగల పాత్రలను కొందరికి విక్రయించేందుకు యత్నిస్తుండగా వీరిని పట్టుకుని, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా విశాఖకు చెందినవారని పోలీసులు తెలిపారు.

03/28/2016 - 18:08

విజయవాడ: అనుకున్న సమయానికే పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు సోమవారం తెలిపారు. ఆయన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనుల తీరుతెన్నులను హెలికాప్టర్‌లో పర్యటించి పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పనుల తీరును సమీక్షించారు. నదుల అనుసంధానానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

03/28/2016 - 18:05

హైదరాబాద్: వైఎస్ జగన్ ధోరణి, పార్టీ విధానాలు నచ్చకపోవడం వల్లే తాను వైకాపాను వదిలిపెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో కాసేపు మాట్లాడుతూ, కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. తన అసంతృప్తిని ఇప్పటికే వైకాపా అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లానని, ఇక ఆయనతో చర్చించాల్సిందేమీ లేదన్నారు.

03/28/2016 - 16:39

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపికైనందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలుగువాడి సత్తా రాజవౌళి నిరూపించారని దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రశంసించారు. హీరోలు వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, నారా రోహిత్, శర్వానంద్, హిందీ నిర్మాత కరణ్ జోహార్ తదితరులు హర్షం ప్రకటించారు.

03/28/2016 - 14:23

విశాఖ: డిపాజిట్లను తీసుకుని వేలాది కోట్ల రూపాయల మేరకు బకాయి పడ్డ అగ్రిగోల్డ్ మోసాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు సోమవారం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ప్రారంభించారు. ఉత్తరాంధ్ర పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.

03/28/2016 - 14:22

కడప: ఓ వాహనంతో ఎమ్మారెఫ్ టైర్స్ షోరూమ్ షట్టర్‌ను ధ్వంసం చేసి, షాపులో నుంచి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే టైర్లు, ఫర్నిచర్‌ను దొంగలు దోచుకువెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. షోరూమ్‌లో ఉన్న సుమారు 80వేల రూపాయల నగదును కూడా దొంగలు పట్టుకుపోయారు.

Pages