S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/28/2016 - 02:32

ఏలూరు, మార్చి 27: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరూ ఎటువంటి అనుమానాలకు తావివ్వవద్దని, ఈప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నాబార్డు ద్వారా ఈప్రాజెక్టుకు నిధులు మంజూరు అవుతాయని, అలాగే దశలవారీగా ఈ నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

03/28/2016 - 02:27

కర్నూలు, మార్చి 27: రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాలో చీలిక తీసుకువచ్చేందుకు పావులు శరవేగంగా కదులుతున్నాయి. ఆ పార్టీ నుంచి 23 మందికి పైగా ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తయ్యాయని టిడిపి నేతల ద్వారా తెలుస్తోంది.

03/28/2016 - 02:26

విశాఖపట్నం, మార్చి 27: చిన్న తరహా పరిశ్రమల్లో కార్మిక చట్టాల ఆవశ్యకతపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవరాయ్ డిమాండ్ చేశారు.

03/28/2016 - 02:25

సింహాచలం, మార్చి 27: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంతో పాటు 108 దేవాలయాల్లో తొలి పూజలు అందుకునే పూసపాటిరాజు వంశీయుల వారసులెవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ధర్మకర్తగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తే వారి పేరున తొలి పూజ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆనందగజపతిరాజు మరణించడంతో ధర్మకర్త పీఠం అధిష్ఠించేదెవరన్న అంశం తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై దేవస్థానం కసరత్తు ప్రారంభించింది.

03/28/2016 - 02:24

విశాఖపట్నం, మార్చి 27: దేశంలో భూసార పరీక్షలకు సంబంధించి ఎంపిక చేసిన ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డుకు విశాఖ జిల్లా రెండో స్థానం దక్కించుకున్న విషయం విదితమే. గుజరాత్‌లోని నర్మదా జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా, మన రాష్ట్రంలోని విశాఖపట్నం రెండో స్థానం దక్కించుకుంది. దీంతో ఢిల్లీ బృందం గత రెండు రోజులుగా విశాఖలో లఘుచిత్రం రూపొందించింది.

03/28/2016 - 02:24

విశాఖపట్నం, మార్చి 27: మధ్యప్రదేశ్, కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఆదివారం విస్తరించి ఉంది. ఇది సోమవారం నాటికి ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి కదిలే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం రాత్రి తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

03/28/2016 - 02:23

పాతబస్తీ, మార్చి 27: ఇటీవల వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన విజయవాడ నగర పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై పోలీసులు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య చోటుచేసుకున్న ఈ సంఘటనపై కొంతమంది తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని జలీల్‌ఖాన్ ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆయన ఫిర్యాదును కూడా పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

03/28/2016 - 02:19

మార్కాపురం, మార్చి 27: వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటి, సమాచార, ముస్లిం మైనార్టీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 716 కోట్ల 54 లక్షల 80 వేల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.

03/28/2016 - 02:18

కడప, మార్చి 27: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రపంచ స్థాయిలోనే పేరుగాంచిన అండర్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనే జిల్లా యువతకు సంబంధాలు ఉన్నట్లు రాజంపేట డీఎస్పీ రాజేంద్ర నిర్ధారించినట్లు తెలుస్తోంది. గ్రూప్-1 అధికారిగా ఎంపికై రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర 20 రోజులు కూడా కాకమునుపే ఎర్రచందనం స్మగ్లింగ్ మూలాలను పెకలించేందుకు చర్యలు చేపట్టారు.

03/28/2016 - 00:50

కాకినాడ, మార్చి 27: ఊహించినట్టుగానే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయా నియోజకవర్గాలలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఇరువురు నేతలూ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమావేశాలు నిర్వహించారు.

Pages