S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2016 - 13:54

హైదరాబాద్: ఎపి శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం సభ ప్రారంభమైనవెంటనే వైకాపా ఎమ్మెల్యేలు నలుపుదుస్తులు ధరించి నిరసన ప్రారంభించారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలని వారు నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. వారి నిరసనను పట్టించుకోకుండానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

03/19/2016 - 12:31

కడప: కర్నాటకలోని సిరా గ్రామంలో కడప జిల్లాకు చెందిన పోలీసులు శనివారం ఉదయం తనిఖీలు చేసి పేరు మోసిన అంతర్జాతీయ స్మగ్లరు అబ్దుల్ రెహ్నాన్, లోకేష్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 75 లక్షల రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని కడప ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు.

03/19/2016 - 12:29

హైదరాబాద్: హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా తమ పార్టీ సభ్యురాలు రోజాను అసెంబ్లీలోకి స్పీకర్ అనుమతించక పోవడం అన్యాయమని వైకాపాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగిస్తామని ఎమ్మెల్యేలు గిడ్డి రాజేశ్వరి, కళావతి తదితరులు ప్రకటించారు.

03/19/2016 - 12:28

హైదరాబాద్: ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో 328 అవగాహన ఒప్పందాలు కుదిరినందున ఎపిలో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు త్వరలోనే కార్యరూపం దాలుస్తాయన్నారు.

03/19/2016 - 12:28

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం యథావిధిగా ప్రారంభమయ్యాయి. సస్పెన్షన్‌కు గురైన తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యేలు నలుపు దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వీరి నిరసన ధ్వనుల మధ్య స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

03/19/2016 - 06:50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 2016-17 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 15 శాతం సాధించాలనే లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

03/19/2016 - 06:32

విశాఖపట్నం: మావోయిస్టు ఎసిఎంతో (ఏరియా కమిటీ మెంబరు)పాటు దళ సభ్యుడు తన ఎదుట లొంగిపోయారని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావో ఏరియా కమిటీ సభ్యురాలిగా (ఎసిఎం)గా ఉన్న కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీకి చెందిన గమ్మలి బందో అలియాస్ కమల అలియాస్ రస్సొ అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయినట్టు తెలిపారు.

03/19/2016 - 06:31

ఆంధ్రభూమి బ్యూరో

03/19/2016 - 06:29

ఆంధ్రభూమి బ్యూరో

03/19/2016 - 06:28

ఆంధ్రభూమి బ్యూరో

Pages