S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/08/2016 - 04:34

విశాఖపట్నం: నౌకాయాన రంగంలో నవశకానికి నాంది పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశాలకు పిలుపునిచ్చారు. సముద్ర జలాల పరిరక్షణ, భద్రత, వాణిజ్య, దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇవన్నీ సాకారం కావాలంటే నౌకాయాన విస్తరణ, పటిష్ఠపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

02/08/2016 - 04:26

కాకినాడ: రెండు ఎకరాల అసామీగా రాజకీయాలకు వచ్చి నేడు రెండు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని సిఎం చంద్రబాబును కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంతో మూడవ రోజుకు చేరింది. కిర్లంపూడిలోని స్వగృహంలోనే భార్య పద్మావతి సహా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముద్రగడ ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు.

02/08/2016 - 04:24

విశాఖపట్నం: విశాఖ ఆర్‌కే బీచ్ యుద్ధ విమానాల ఘోషతో అదిరిపోయింది. బాంబుల మోతతో దద్దరిల్లింది. తుపాకీ శబ్దాలతో మార్మోగింది. దూసుకుపోతున్న మిసైళ్లు.. తీరానికి దగ్గరగా వచ్చి నైపుణ్యాన్ని ప్రదర్శించిన హెలికాప్టర్లు.. ఒకటేమిటి. నిజంగా యుద్ధ భూమిలో ఉన్నామా? అన్నట్టున్నాయి ఫ్లీట్ రివ్యూ ముగింపు సన్నివేశాలు.

02/08/2016 - 04:23

విశాఖపట్నం: వచ్చే బడ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లను కేటాయించనున్నట్టు అర్థిక మంత్రి, కాపు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రకటించారు. కాపులను బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన దీక్షపై సిఎం చంద్రబాబుతో కేబినెట్ సబ్ కమిటీ విశాఖలో ఆదివారం మధ్యాహ్నం భేటీ అయింది.

02/07/2016 - 21:16

కాకినాడ-కాపు సామాజికవర్గాన్ని బిసి జాబితాలో చేరుస్తూ జీవో విడుదల చేయాలన్న లక్ష్యంతో ఆమరణదీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీభావం చెప్పదల్చుకున్నవారు ఎక్కడికక్కడ ఆ పని చేయాలేతప్ప కిర్లంపూడికి రావద్దని తూర్పుగోదావరి జిల్లా ఎస్.పి. రవిప్రకాశ్ కోరారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఉందని, తునిలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, అందువల్ల కిర్లంపూడికి వచ్చి ఇబ్బందులు సృష్టించవద్దని ఆయన కోరారు.

02/07/2016 - 18:30

విశాఖపట్నం- అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష సందర్భంగా నిర్వహించినా నౌకావిన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయని, అంతకన్నా విశాఖ ప్రజల స్ఫూర్తి నచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విశాఖలో రెండురోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో భాగంగా ఆదివారం సాయంత్రం మోదీ మాట్లాడారు.

02/07/2016 - 18:30

హైదరాబాద్-కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు వైకాపా సీనియర్ నేతలు కిర్లంపూడి వెళ్లనున్నారు. వైకాపా బృందంలో బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు మరికొందరు కాపునేతలు ఉంటారు.

02/07/2016 - 18:28

హైదరాబాద్-పేస్కేల్ అమలుతోపాటు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ తెలంగాణలో మోడల్ స్కూళ్ల బోధనాసిబ్బంది సోమవారంనుంచి ఆందోళనబాటపట్టనున్నారు. నగరంలోని ఇందిరాపార్క్‌వద్ద వారు దీక్షలు ప్రారంభించనున్నారు.

02/07/2016 - 18:28

హైదరాబాద్-దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైన్‌కు తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ఉద్యానవనశాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ అయి పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి నిర్ణయాలను మంత్రులు పోచారం, హరీష్‌రావు విలేకరుల సమావేశంలో వివరించారు.

02/07/2016 - 17:44

హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల సమస్య మరింత జటిలం కాకుండా కాపు ఉద్యమ నేతలతో ఎపి ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీని టిడిపి నిలబెట్టుకోవాలని, అదే సందర్భంగా ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు మేధావులతో ఒక కమిటీని నియమించాలన్నారు.

Pages