S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/10/2015 - 18:45

చిత్తూరు: జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాంతిపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శాంతిపురం దశ-దిశా-నిర్దేశ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

12/10/2015 - 14:20

రాజమండ్రి : త్వరలో డీఎస్సీ ఉద్యోగాలు, ఇతర పోస్టులు భర్తీచేస్తామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఏపీ లోటు బడ్జెట్‌తో ఉన్నందున ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తిచేస్తున్నామని తెలిపారు. రూ.10వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడతామని అన్నారు.

12/10/2015 - 11:25

విశాఖ: విశాఖ ఏజెన్సీ మండలాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 9 గంటల సమయంలో కూడా మంచు మేఘాలు కమ్ముకొంటున్నాయి. లంబసింగిలో 7, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

12/10/2015 - 11:24

కాకినాడ: అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 51 గోవులకు ఈ సందర్భంగా పసుపు కుంకుమలు రాసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇవో నాగేశ్వరరావుతోపాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

12/10/2015 - 11:24

కడప: స్థానిక వైకాపా నాయకుడు మునిరెడ్డిపై అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం వెలుగు చూసింది. తీవ్రంగా గాయపడిన మునిరెడ్డిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

12/10/2015 - 11:24

నెల్లూరు: కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కరువు పరిస్థితులను తెలుసుకొనేందుకు కేంద్ర అధికారుల బృందం గురువారం పర్యటిస్తుంది. నెల్లూరులో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు.

12/10/2015 - 11:22

చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని సంగవేలు సారధి కాలనీలో భార్యను ఓ భర్త హతమార్చిన ఘటన గురువారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

12/09/2015 - 18:25

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 11 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

12/09/2015 - 15:21

కరీంనగర్‌: వేములవాడ మండలం సంకేపల్లి జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో దాదాపు రూ.50లక్షల విలువైన పత్తి దగ్ధమైంది.

12/09/2015 - 15:18

విజయవాడ: కల్తీ మద్యం ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ మహేశ్‌చంద్ర లడ్డా నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు. సిట్‌లో గ్రేహౌండ్స్‌ ఎస్పీ సెంథిల్‌కుమార్‌, డీఎస్పీలు టి .కనకరాజు, ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు వైవీనాయుడు, కె.శ్రీనివాసరావు, అబ్దుల్‌ కరీం, సీహెచ్‌ రాంబాబు, మీరా సాహెబ్‌లను నియమించారు. విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆధ్వర్యంలో సిట్‌ పనిచేయనుంది.

Pages