S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/08/2015 - 15:54

విజయవాడ : స్వర్ణభారత్ కల్తీ మద్యం ఘటనతో మల్లాది విష్ణుకు సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా తేల్చిచెప్పారు. మల్లాది విష్ణును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, మృతుల కుటుంబాలకు మద్యం కంపెనీల నుండి నష్టపరిహారం అందించేలా చట్టం తీసుకరావాలని సూచించారు.

12/08/2015 - 14:05

విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పనులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు పరిశీలించారు. విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన వెంకటాపురం చేరుకుని అక్కడ నుంచి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. మెగా ఇంజినీరింగ్ కంపెనీ డైరెక్టర్ పనులను వివరించారు.

12/08/2015 - 14:02

కర్నూలు: సిరివెల్లమెట్ట వద్ద జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

12/08/2015 - 11:55

విజయవాడ: ఇక్కడి స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఆస్పత్రి పాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం కల్తీమద్యం ప్రభావంతో ఐదుగురు మరణించగా, మరో 18 మంది ఆస్పత్రి పాలయ్యారు. మద్యంలో మిథైల్ ఆల్కహాల్ ప్రభావం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని, మద్యం శాంపిల్స్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నిందితులు ఎంతటివారైనప్పటికీ చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎ.పి.

12/08/2015 - 11:53

కాకినాడ: ఇక్కడి సిద్దార్థ నగర్‌లో మంగళవారం ఉదయం ఓ ఇంట్లో చెలరేగిన మంటలు వ్యాపించి 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

12/08/2015 - 11:52

అనంతపురం: సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలయినట్లు తెలుసుకొని మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి సోమవారం అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కళ్యాణదుర్గంకు చెందిన లోకేష్ (23)గా గుర్తించారు. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి ఆత్మహత్యతో కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

12/07/2015 - 16:59

శ్రీకాకుళం : జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయని, పరిశ్రమలు వస్తే జిల్లా అత్యున్నతంగా అభివృద్ధిచెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన సోమవారం వజ్రపుకొత్తూరులో జరిగిన జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు ఏర్పాటుకు మత్స్యకారులు ఎలాంటి ఆందోళనచెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

12/07/2015 - 16:58

తిరుమల : ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.20 కోట్లు మంజూరు చేసింది. దేవునికడపలో ఆలయ భవన సముదాయానికి రూ.5 కోట్లు కేటాయించింది. రాఘవేంద్రస్వామి మఠానికి 10వేల చదరపు అడుగుల స్థలం కేటాయించింది. అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉద్యోగులకు సైతం ప్రోత్సహాకాలను మంజూరుచేస్తూ నిర్ణయం తీసుకుంది.

12/07/2015 - 14:15

మహానంది: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కర్నూలు జిల్లా మహానందీశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దాదాపు 60 వేల మంది భక్తులు నందీశ్వరుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఈ రోజు స్వామిని దర్శించుకున్నారు.

12/07/2015 - 14:08

విజయవాడ: కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని భాజపా, వామపక్షాల కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Pages