S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/07/2015 - 14:05

విజయవాడ : విజయవాడలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కృష్ణలంకలో నిర్వహిస్తున్న వైన్‌షాపులో మద్యం తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురు మృతిచెందగా... 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు.

12/07/2015 - 11:53

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఎ.పి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలిశారు. నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు.

12/07/2015 - 11:53

విశాఖ: విశాఖలోని నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.

12/07/2015 - 11:52

చిత్తూరు: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూకు సహకరించిన నలుగురు యువకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చింటూకు వీరు వాహనాలు, తుపాకులు సమకూర్చినట్టు పోలీసులు తెలిపారు.

12/07/2015 - 11:50

విజయవాడ: ఎ.పి. రాజధాని అమరావతి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో మంత్రి రావెల కిషోర్‌బాబు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి కొందరు మంత్రులు తమకు అనువైన ఇళ్ల కోసం గాలిస్తున్నారు.

12/07/2015 - 11:49

విజయవాడ: టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించే జన చైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సోమవారం ఉదయం విజయనగరం చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. టిడిపి యువనేత లోకేష్ విశాఖ జిల్లాలో జన చైతన్య యాత్రలో పాల్గొంటున్నారు.

12/07/2015 - 11:48

విజయవాడ: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భీమవరంలోని సోమేశ్వరాలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పాలకొల్లు, అమరావతి, తెలంగాణలోని వేములవాడ, కీసర, కాళేశ్వరం, భద్రాచలం తదితర ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.

12/06/2015 - 08:18

సోంపేట, డిసెంబర్ 5: వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు శనివారం థర్మల్ సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారంటూ మత్స్యకారులు నిలదీశారు.

12/06/2015 - 08:18

మంత్రి నారాయణను నిలదీసిన వైకాపా ఎమ్మెల్యేలు.. నెల్లూరు జడ్పీ సమావేశంలో వాగ్వాదం

12/06/2015 - 08:16

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సంపర్క ప్రముఖ్ అనిరుధ్ దేశ్‌పాండే

Pages