S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/24/2019 - 23:29

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి 69.4 శాతం పూర్తయింది. వారాల వారీగా నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే విధంగా లక్ష్యాన్ని సవరణచేశారు. అయితే కనెక్టవిటీ ప్యాకేజీల్లో జఢత్వం కన్పిస్తోంది. ఎడమ ప్రధాన కాల్వ పనులు కూడా మందగమనంలో సాగుతున్నట్టుగా కన్పిస్తోంది.

04/24/2019 - 23:28

విజయవాడ, ఏప్రిల్ 24: టీటీడీపై వైకాపా నేత విజయసాయిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. బ్యాంక్ నుంచి బంగారం తరలింపుపై వైకాపా నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

04/24/2019 - 23:28

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 24: విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మరో అడుగు ముందుకేసింది. విచారణలో భాగంగా ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో ఇక్కడ పనిచేసిన పోలీసులను సీబీఐ అధికారులు విచారించారు. కానిస్టేబుల్ రామారావు, శంకర్, రాధాల స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. హత్య జరిగిన సమయంలో దర్యాప్తు తీరు, గుర్తించిన ఆధారాల గురించి వివరాలు తెలుసుకున్నారు.

04/24/2019 - 03:16

తిరుపతి, ఏప్రిల్ 23: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన 1381 కేజీల బంగారం చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి టీటీడీ ట్రెజరీకి తరలించే అంశంపై తలెత్తిన వివాదంపై రాష్ట్ర ముఖ్యకార్యదర్శి నియమించిన కమిటీ మంగళవారం విచారణను పూర్తిచేసింది. నివేదికను సిద్ధం చేసింది.

04/23/2019 - 23:27

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: మట్టి గుణం తెలియకుండా నిర్మాణం దుర్లభం..ఎటువంటి నిర్మాణానికైనా పునాది చాలా కీలకం. అటువంటి పునాది ఎంత లోతు తవ్వాలనే విషయాన్ని నిర్మాణ ప్రాంతంలోని మట్టికి నమూనా పరీక్షలు నిర్వహించి చెప్పగలిగే జలవనరుల శాఖ ప్రాంతీయ ఇంజనీరింగ్ పరిశోథనా కేంద్రాలకు ఇపుడు పునాదే లేకుండాపోయింది.

04/23/2019 - 23:25

అమరావతి, ఏప్రిల్ 23: ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీ డీఆర్పీ) కింద మంజూరు చేసిన ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని ఒకటవ బ్లాక్‌లో ఏపీడీఆర్‌పీ ప్రాజెక్ట్ అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/24/2019 - 04:00

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవటానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాపమే కారణమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు మోదీ, కేసీఆర్, జగన్ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు.

04/23/2019 - 23:23

విజయవాడ, ఏప్రిల్ 23: విధాన పరమైన నిర్ణయాలు మినహా ప్రభుత్వం మామూలుగానే విధులు నిర్వహించవచ్చని ఎన్నికల సంఘం చెబుతున్నా, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్షలను వైకాపా నేతలు తప్పుపట్టడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.

04/23/2019 - 23:22

గుంటూరు, ఏప్రిల్ 23: కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకునే నీచస్థితికి వైసీపీ నాయకులు దిగజారారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

04/23/2019 - 23:21

విజయవాడ, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని వేసవి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరవు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్యలు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.

Pages