S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/20/2018 - 17:41

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన స్థానిక మున్సిపల్ స్టేడియంలో విద్యార్థులతో నిర్వహించిన జ్ఞానభేరీ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలను బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుందని అన్నారు.

09/20/2018 - 13:55

అమరావతి: దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఏపీలో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్బందులన్నింటినీ అధిగమించి ప్రజల మద్దతుతో ఫలితాలు సాధించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు.

09/20/2018 - 12:43

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం కళింగపట్నం (శీకాకుళం)- పూరీ (ఒడిశా) మధ్య తీరం దాటే అవకాశం ఉందని భువనేశ్వర్ వాతావరణ అధ్యయన కేంద్రం వెల్లడించింది.

09/20/2018 - 12:42

తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు విశేషాలంకరణతో ఆశీనులయ్యారు. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ రథాన్ని లాగగా.. తిరువీథుల్లో కన్నులపండువగా రథోత్సవం జరిగింది.

09/20/2018 - 05:17

* హోదా ఇవ్వొద్దని ఎవరు.. ఎక్కడ చెప్పారు? * అసెంబ్లీలో బీజేపీకి బాబు చురకలు

09/20/2018 - 05:15

విజయవాడ, సెప్టెంబర్ 19: కాంట్రిబ్యూటరీ పింఛను స్కీమ్ (సీపీఎస్)ను అన్ని కోణాల్లో పరిశీలించేందుకు వీలుగా నిపుణులతో కమిటీని నియమించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. సీపీఎస్‌పై ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పట్టుబట్టినప్పటికీ, తన వైఖరి చెప్పకుండా, నిపుణులతో వివిధ కోణాల్లో పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

09/20/2018 - 05:14

విజయవాడ, సెప్టెంబర్ 19: ‘సత్యమేవ జయతే’ బహిరంగ సభతోపాటు కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్న అన్ని కార్యక్రమాలు విజయవంతం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

09/20/2018 - 05:12

కాకినాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అక్టోబర్ నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో బుధవారం జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సమావేశంలో కన్నా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

09/20/2018 - 05:05

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ చేసిన మోసం, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు విస్మరించడాన్ని ప్రజలు గ్రహించారన్నారు. అందుకే వారు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు.

09/20/2018 - 04:51

అమరావతి, సెప్టెంబర్ 19: ప్రభుత్వం పేదరిక నిర్మూలన..ఆర్థిక అసమానతల తొలగింపు లక్ష్యంగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బుధవారం శాసనసభలో 344 నిబంధన కింద గ్రామ, వార్డు వికాసం కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పేదవారికి పనికల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మహిళలకు రక్షణగా ఉంటామని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Pages