S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/20/2018 - 02:42

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మించిన భూ బకాసురుడు మరొకరు లేరని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వారానికి ఐదు ప్రశ్నలు వేస్తానంటున్న కన్నాకు తాము పది ప్రశ్నలు వేస్తున్నామని, చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

09/20/2018 - 02:40

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 18,450 పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. 182 గ్రూపు-1 పోస్టులు, 337 గ్రూపు-2 పోస్టులు, 1670 గ్రూపు-3 పోస్టులు, 3000 పోలీస్ ఎగ్జిక్యూటివ్, వైద్య శాఖలో 1604 పోస్టులు, 8275 టీచింగ్ పోస్టులు, మరో 1657 పోస్టులను, 725 అధ్యాపక పోస్టులను భర్తీ చేసందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

09/19/2018 - 17:31

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన పోస్టుల భర్తీకి ఆరు నెలల నుంచి ఏడాదిలోపు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. మరో 15 రోజుల్లో గ్రూప్ 1,2,3 పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. ఏ పోస్టులకు ఏపుడు నోటిఫికేషన్ విడుదల చేస్తామో వెల్లడిస్తామని తెలిపారు.

09/19/2018 - 17:30

అమరావతి:ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరారు.

09/19/2018 - 15:58

విశాఖపట్నం: తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ, మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్, ఆంధ్రప్రదేశ్ తీరం రెండ్రోజుల పాటు వెళ్లరాదని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

09/19/2018 - 13:34

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో నెలకొల్పనున్న ఎన్టీయార్ విగ్రహ ప్రతిష్టకు మంత్రి పుల్లారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచేవారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ఆ దిశగా కసరత్తు ప్రారంభిస్తామని వెల్లడించారు.

09/19/2018 - 12:47

విజయవాడ: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని ఆ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు తెలిపారు. ఆయన మంగళవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ గడపగడపకు వైకాపా నవరత్నాల కార్యక్రమాన్ని తీసుకువెళతానని చెప్పారు. తన కోసం వంగవీటి రాధాను తప్పించారనటం సరికాదని, గడపగడపకు పార్టీని ముందుకు తీసుకువెళతానని చెప్పారు. సెంట్రల్‌లో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.

09/19/2018 - 12:47

అమరావతి: సీఎం చంద్రబాబును ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. తాడిపత్రిలో ప్రభోదానంద స్వామి వ్యవహారానికి సంబంధించిన వివరాలను జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. ఇందుకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ను సీఎంకు అందించనున్నారు.

09/19/2018 - 12:45

అమరావతి: గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై నియమించిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ముహుర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమేనని వెల్లడించింది. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు ముహుర్త కాలంలో పుష్కర స్నానం ఆచరించేందుకు పోటెత్తటంతో ఈ ఘటన జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది.

09/19/2018 - 12:45

కడప: నగరంలో పవన్‌కుమార్ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. తిలక్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌కు రాము అనే వ్యక్తితో ఆర్థిక విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్ రాము ఇంటికి వెళ్లాడు. అక్కడ వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రాము ఆవేశంతో కత్తి తీసుకుని పవన్‌కుమార్‌పైకి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Pages