S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/19/2019 - 00:20

విజయవాడ, అక్టోబర్ 18: మహిళా, శిశు సంక్షేమ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని ఆ శాఖ మంత్రి తానేటి వనిత ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో తన శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

10/19/2019 - 00:19

గుంటూరు, అక్టోబర్ 18: చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడిచేలా నిబంధనలను తుంగలో తొక్కుతూ పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆక్షేపించారు. శుక్రవారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజుతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు.

10/19/2019 - 00:19

విజయవాడ, అక్టోబర్ 18: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఏపీ హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సందర్భంగా తాను రచించిన, అనువదించిన సాహితీ సంపుటాలను బహూకరించారు.

10/19/2019 - 00:18

ఆళ్లగడ్డ, అక్టోబర్ 18: ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో నిర్మించ తలపెట్టిన అన్నదాన భవనానికి గంగుల సుభాష్‌రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు. అహోబిల మఠంలో ఉన్న 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిని శుక్రవారం సుభాష్‌రెడ్డి దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం పీఠాధిపతి సమక్షంలోనే అన్నదాన భవన నిర్మాణానికి అయ్యే రూ. 2 కోట్లు విరాళంగా ప్రకటించారు.

10/19/2019 - 00:04

విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో మాదిరిగా నవంబర్ 1న నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆరోజు కార్యక్రమాల నిర్వహణపై ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

10/19/2019 - 00:03

విజయవాడ, అక్టోబర్ 18: కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను 1000 కోట్ల రూపాయలతో ఏపీఎస్ ఆర్టీసీ కొనుగోలు చేయనుంది. ఈ మొత్తాన్ని రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఆర్టీసీ 11,920 బస్సులను నడుపుతోంది. ఇందులో 3677 బస్సులు 10లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి. దీంతో ఆ బస్సులను ఆర్టీసీ సేవల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

10/19/2019 - 00:02

విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలను చేపట్టేందుకు ఏపీ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం 2013 కింద లాభాపేక్ష లేని సంస్థగా ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్సల్టెన్సీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, వాహనాలు, తదితర విభాగాల్లో నియామకాలను ఈ సంస్థ ద్వారా చేపడతారు.

10/18/2019 - 23:17

పోలవరం, అక్టోబర్ 18: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగి బీటలువారింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. ఈ తరహాలో కుంగడం నాలుగోసారి. పాత మామిడిగొంది గ్రామ సమీపంలో వంద మీటర్ల పొడవున మట్టి రోడ్డు బీటలు వారింది. భారీ వర్షాలకు రోడ్డు కుంగివుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు అంచులు సైతం కోతకు గురయ్యాయి.

10/18/2019 - 23:16

విశాఖపట్నం, అక్టోబర్ 18: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ వర్గాలకు మేలుచేకూర్చేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఆరోపించారు.

10/18/2019 - 23:16

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలన, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాలపై జనసేన పోలిట్‌బ్యూరో సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. జనసేన పోలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం నాడు హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది.

Pages