S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/01/2019 - 05:58

విజయవాడ, డిసెంబర్ 31: ఏపీకి కేటాయించగా శిక్షణ పొందుతున్న యువ ఐఏఎస్ అధికారులు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పుణేఠాతో సోమవారం భేటీ అయ్యారు. వారికి తన అనుభవాలను వివరించి, భవిష్యత్తులో ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకునేందుకు వివిధ అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

01/01/2019 - 05:56

విజయవాడ, డిసెంబర్ 31: ప్రయాగలో జనవరి 15నుంచి జరిగే కుంభమేళా ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తరపున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహానా, ఉండవల్లిలోని సీఎం నివాసంలో సోమవారం కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వారణాసిలో జనవరి 21నుంచి 3రోజులు జరిగే ప్రవాస భారతి దినోత్సవానికి కూడా హాజరుకావాలని కోరారు.

01/01/2019 - 05:54

విజయవాడ (సిటీ), డిసెంబర్ 31: సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న దేశ, విదేశాల్లోని తెలుగు వారందరికీ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారందరికీ నూతన సంవత్సరం శుభప్రదమూ, జయప్రదమూ కావాలని ఆకాంక్షించారు. తెలుగు వారంతా ఈ ఏడాది సుఖసంతోషాలతో గడపాలన్నారు.

01/01/2019 - 05:52

విజయవాడ, డిసెంబర్ 31: ఓటర్ ఐడీ (ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు)తో ఓటరు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసే ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియా వెల్లడించారు.

01/01/2019 - 05:51

విజయవాడ, డిసెంబర్ 31: నాడు ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావంతో రాజధాని కర్నూలు కేంద్రంగా ఏర్పడగా హైకోర్టు గుంటూరులో ఏర్పాటై కొంతకాలం పనిచేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో హైకోర్టు హైదరాబాద్‌కు తరలివెళ్లింది. తర్వాత హైకోర్టు బెంచ్ కోసం రాష్ట్రంలో అనేకానేక ఉద్యమాలు జరిగాయి. రాష్ట్ర విభజన వల్ల లాభమో నష్టమో తెలియదుకాని తిరిగి హైకోర్టు గుంటూరు జిల్లాలో పునఃప్రారంభం కాబోతోంది.

01/01/2019 - 05:50

విజయవాడ: గత విజయాలను సమీక్షించి, నవ సంకల్పంతో భవిష్యత్తును నిర్మించుకునేందుకు వచ్చిన శుభ సమయమే కొత్త సంవత్సరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.

01/01/2019 - 05:49

రాజమహేంద్రవరం, డిసెంబర్ 31: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు లక్ష్యం సంవత్సరంలోకి అడుగు పెట్టింది. కొత్త సంవత్సరంలో కొత్త డీపీఆర్‌తో పోలవరం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. భూసేకరణలో సీడబ్ల్యూసీ గండం నుంచి బయటపడి ఇపుడు పునరావాసం ఎందుకు పెరిగిందనే పరీక్షను ఎదుర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని సాధించే ఏడాదిలోకి చేరింది. ఈ ఏడాది చివరికి గ్రావిటీపై నీరు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది.

01/01/2019 - 05:48

విజయవాడ, డిసెంబర్ 31: బుడగ జంగాలకు రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లపై సిఫారసులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను సోమవారం అందజేసింది. విశాంత్ర ఐఏఎస్ జేసీ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ తుది నివేదికను ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ నివేదిక రూపొందించారు.

01/01/2019 - 05:48

విజయవాడ, డిసెంబర్ 31: విశాఖలో 22కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆధునిక ల్యాబ్‌ను ఈ నెల 23న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. సోమవారం ఆయన వెలగపూడి సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

01/01/2019 - 05:47

విజయవాడ, డిసెంబర్ 31: అనంతపురంలో అమ్యూనేషన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు స్టంప్ ష్యూలే కేసింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ దేశ రక్షణ రంగాలకు అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో అమ్యూనేషన్ ఉత్పత్తులను దేశీయంగా తయారుచేసి సరఫరా చేస్తుంది.

Pages