S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/30/2018 - 01:35

విజయవాడ(సిటీ), డిసెంబర్ 29: ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించే అభయ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఆవిష్కరించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద పోస్టర్‌ను విడుదల చేసిన చంద్రబాబు మాట్లాడుతూ అంతర్జాల పరిజ్ఞానాన్ని వినియోగించి రవాణాశాఖ రూపొందించిన అత్యాధునిక అభయ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణ సమయాల్లో బాలికలు, మహిళల భద్రతకు చర్యలు తీసుకునే వీలుంటుందన్నారు.

12/29/2018 - 23:56

అమరావతి, డిసెంబర్ 29: గత మూడేళ్లలో ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద మంజూరైన ఆరు లక్షల ఇళ్లలో ఇంకా 60వేల ఇళ్లు ప్రారంభం కాలేదని, వాటిని వెంటనే ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

12/29/2018 - 01:09

విజయవాడ(సిటీ), డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని ఒకే ప్రాంతలో కేంద్రీకరించకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తున్నామని ఏపీ ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని, అయితే వ్యవసాయంలో మాత్రం గణనీయమైన అభివృద్ధి సాధించగలగామన్నారు.

12/29/2018 - 01:05

తిరుమల, డిసెంబర్ 28: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు ముగిసినపనప్పటికీ యేడాది ముగింపు నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ కూడా శుక్రవారం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 24 గంటలు సమయం పడుతోంది.

12/29/2018 - 01:05

అనంతపురం, డిసెంబర్ 28: రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న కరువు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ, సీపీఎం సంయుక్తంగా చేపట్టిన రాయలసీమ బంద్ పాక్షికంగా జరిగింది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో బంద్ సందర్భంగా పలువురు వామపక్షనేతలను పోలీసులు అరెస్టుచేసి అనంతరం విడుదల చేశారు.

12/29/2018 - 00:02

అనకాపల్లి, డిసెంబర్ 28: తన సొంత జిల్లా కడపలో సమస్యలనే పట్టించుకోని ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రానికి సీఎం అయి ఏం ఒరగబెడతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆదరణ-3 పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన గ్రౌండింగ్ మేళా, బహిరంగ సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, ప్రతిపక్ష నేత జగన్ తీరును దుయ్యబట్టారు.

12/29/2018 - 00:02

విజయవాడ, డిసెంబర్ 28: డీఎస్సీ 2018 తుది కీ జనవరి 7న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటివరకూ నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్) పరీక్షల మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు పరీక్షలు రాసిన అభ్యర్థులు జనవరి 2 సాయంత్రం 5 గంటల లోపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు.

12/29/2018 - 00:01

ఒంగోలు, డిసెంబర్ 28: ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తక్షణమే ప్రభుత్వం కరవు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా శుక్రవారం ఒంగోలులోని దక్షిణ బైపాస్‌రోడ్డులోని జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఆందోళనకారులు రోడ్డుకు అడ్డంగా నిలబడి రాస్తారాకో చేపట్టారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

12/29/2018 - 00:00

రాజమహేంద్రవరం, డిసెంబర్ 28: పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా ఎడమ వైపు కనెక్టివిటీల్లో చేపట్టిన టనె్నల్స్ నిర్మాణ పనులు తీవ్ర మందగమనంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పనుల్లో కనీస పురోగతి కనిపించడంలేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ గట్టు వైపు ప్యాకేజీ నెంబర్ 65, 66లో 919 మీటర్లు, 890 మీటర్ల పొడవైన టనె్నల్స్ నిర్మాణం చేపట్టారు.

12/28/2018 - 23:44

విజయవాడ(సిటీ), డిసెంబర్ 28: సంక్షేమం...గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వౌలిక సదుపాయాల పురోగతి...6వ జన్మభూమి...చుక్కల భూములు.. ఈ నాలుగు అంశాలే ప్రధాన అజెండాగా జిల్లా కలెక్టర్ల 19వ సదస్సు శనివారం జరగనుంది. ఈనెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ తొలి పది ప్రధాన కార్యక్రమాలపై సమాలోచన జరగనుంది.

Pages