S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/05/2016 - 04:25

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఏప్రిల్ 4: నూతన రాజధాని అమరావతిలో రాష్ట్ర వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా ట్రేడ్ సెంటర్ ఏర్పాటు ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించటం లేదని వ్యాపార వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

04/05/2016 - 03:43

విజయవాడ, ఏప్రిల్ 4: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందేలా ఇక తమ కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కృషి చేయనున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. సోమవారం నాడిక్కడ పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ముఖ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కంభంపాటి విలేఖర్లతో మాట్లాడారు.

04/05/2016 - 03:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: బొగ్గు కుంభకోణంలో ఝార్ఖండ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ (జెఐపిఎల్) డైరెక్టర్లు ఆర్‌ఎస్ రుంగ్టా, ఆర్‌సి రుంగ్టాలకు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కోర్టు వీరిద్దరికి రూ. అయిదు లక్షల చొప్పున జరిమానా విధించింది. జెఐపిల్‌కు రూ. 25 లక్షల జరిమానా విధించింది.

04/05/2016 - 03:40

ఏలూరు, ఏప్రిల్ 4 : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సోమవారం పట్టపగలే ఘాతుకం చోటు చేసుకుంది. పగలు 12 గంటల సమయంలో న్యాయవాది పలివెల దత్తాత్రేయ రామానంద రాయలు (45) దారుణంగా హత్యకు గురయ్యారు.

04/05/2016 - 03:35

గుడిపాల, ఏప్రిల్ 4: ఆర్మీలో విధుల్లో ఉన్న సైనికుడు విద్యుదాఘాతంతో మృతి చెందగా ఆ జవాను మృతదేహం స్వగ్రామానికి సోమవారం చేరుకుంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పెరుమాళ్లకుప్పం గ్రామానికి చెందిన నందకుమార్(37) అనే యువకుడు జమ్ము కాశ్మీర్‌లో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో అతను విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు.

04/05/2016 - 03:33

విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐపిఎస్ బదిలీలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రమోషన్లు పొంది, అందుకు తగిన పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న ఐపిఎస్ అధికారులతో బాబు సోమవారం విజయవాడలోని సిఎం క్యాంపుఆఫీసులో భేటీ అయ్యారు. ఒక్కో పోలీస్ అధికారితో విడివిడిగా ఆయన సమావేశమయ్యారు.

04/04/2016 - 18:20

ఏలూరు: తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్‌లో ఫస్ట్ ఇయర్ విద్యార్థి రాహుల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని సహచర విద్యార్థులు గమనించి కళాశాల యాజమాన్యానికి తెలిపారు. ఇతని ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

04/04/2016 - 15:07

తిరుపతి: ఇంటి నెంబర్ల ఆధారంగా జారీ చేసే ఓటరు గుర్తింపుకార్డుల వల్ల ఇకముందు ఒకే కుటుంబానికి చెందిన వారంతా ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేసే అవకాశం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని దేశంలోనే తొలిసారిగా ఎపిలో ప్రారంభించామని ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఓటర్ల జాబితా పునశ్చరణపై నాలుగు జిల్లాల అధికారులతో సోమవారం ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/04/2016 - 15:07

మచిలీపట్నం: ఇక్కడి నిజాంపేటలో దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తిలేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని అణచివేస్తామని ఎపి హోం మంత్రి ఎన్.చినరాజప్ప అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ రంగా విగ్రహం విధ్వంసానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

04/04/2016 - 15:04

ఏలూరు: ఏలూరు పట్టణంలో సోమవారం ఉదయం గాంధీ హైస్కూల్ వద్ద ఓ దుకాణంలో కూర్చున రాయలు అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. పట్టపగలే కత్తులతో దారుణంగా పొడిచి లాయర్‌ను హత్యచేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Pages