S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/28/2018 - 02:37

నెల్లూరు, డిసెంబర్ 27: దగదర్తి విమానాశ్రయ భూనిర్వాసితులైన రైతులు మండల టీడీపీ నేత సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడుతో పాటు ఇతర రైతులు మాట్లాడుతూ దగదర్తి మండలం దామవరం సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థానిక రైతులకు చెందిన సుమారు 1400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు.

12/28/2018 - 02:36

విశాఖపట్నం, డిసెంబర్ 27: రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నగరాన్ని పర్యాటక రంగంలో కూడా మరింత ప్రోత్సహం అందించేందుకు ఏటా డిసెంబర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే విశాఖ ఉత్సవ్ నిర్వహణకు రంగం సిద్దమైంది. ఈ నెల 28 నుంచి 30 వరకూ మూడు రోజుల పాటు విశాఖ ఆర్కేబీచ్‌లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

12/28/2018 - 02:35

విజయవాడ, డిసెంబర్ 27: రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిలకించేందుకు వీలుగా శుక్రవారం నుంచి అమరావతి సందర్శన యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులు చూపిస్తామని వివరించారు.

12/28/2018 - 02:35

విజయవాడ, డిసెంబర్ 27: వైసీపీ ఢిల్లీ గర్జన పెద్ద మోసమని శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాదరావు విమర్శించారు. సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో పోరాటం చేయకుండా బీజేపీకి మేలు కలిగేలా వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని మండిపడ్డారు.

12/28/2018 - 02:34

విజయవాడ, డిసెంబర్ 27: రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభాన్ని తీర్చామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శే్వతపత్రం విడుదల చేస్తూ చెప్పడం ‘జోక్ ఆఫ్ ది ఇయర్’గా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఓ ప్రకటనలో విమర్శించారు. రైతు సంక్షేమం కోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎంతో కృషి చేసామని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శే్వతపత్రం లోపభూయిష్టంగా ఉందన్నారు.

12/28/2018 - 02:34

విజయవాడ, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా జనవరి 2 నుంచి 11 వరకూ నిర్వహించనున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం అధికారులతో జన్మభూమి కార్యక్రమంపై సీఎస్ సమీక్షించారు.

12/28/2018 - 04:45

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పర్యావరణ హితంగా సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

12/27/2018 - 04:35

విజయవాడ, డిసెంబర్ 26: రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో గురువారం మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. పరిపాలనా నగరంలోని కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఐదు టవర్లుగా నిర్మించనున్న సచివాలయం కోసం భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను నిర్మించనున్నారు. భూమి ఉపరితలం నుంచి 13 అడుగుల లోతులో నాలుగు మీటర్ల మేర ర్యాఫ్ట్‌ను నిర్మించనున్నారు.

12/27/2018 - 04:33

రాజమహేంద్రవరం, డిసెంబర్ 26: మన్యం రైతులకు సాగునీటి సదుపాయం కల్పించడానికి తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలో నిర్మించిన భూపతిపాలెం రిజర్వాయరు ప్రాజెక్టు నిర్వాసితులు నిలువ నీడలేక చెట్టుకొకరు పుట్టకొకరుగా అల్లాడుతున్నారు. 15 కుటుంబాల కోసం పదేళ్ల క్రితం నిర్మించిన కాలనీలోని ఇళ్లు శిథిలావస్థకు చేరుకుని, నేడో రేపో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.

12/27/2018 - 04:31

గుంటూరు, డిసెంబర్ 26: బీసీలు స్వతంత్రంగా ఎదిగేందుకు అందరి ఆమోదంతో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.

Pages