S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/27/2018 - 04:30

విశాఖపట్నం, డిసెంబర్ 26: ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును టీడీపీకి, చంద్రబాబుకు ఆదాయ వనరుగా మార్చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

12/27/2018 - 04:28

విజయవాడ (క్రైం), డిసెంబర్ 26: పోలీసుశాఖలోని వివిధ పోస్టులకు ఈనెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రాతపరీక్షలో 51,926 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్ధులకు వచ్చే ఏడాది జనవరి 18వ తేదీన శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రాష్ట్రంలోని విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఏర్పాటు చేసినట్లు స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

12/27/2018 - 03:14

మడకశిర, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాష్ట్ర రాజకీయాల నుండి తప్పుకుని కేంద్ర రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారని, అందుకే దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

12/27/2018 - 02:57

విశాఖపట్నం, డిసెంబర్ 26: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా భారతదేశం 45కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తోందని నేషనల్ మారిటైం ఫౌండేషన్ చైర్మన్, నౌకాదళ మాజీ ప్రధానాధికారి ఆర్కే ధవాన్ తెలిపారు.

12/26/2018 - 03:51

విజయవాడ, డిసెంబర్ 25: ఏసుక్రీస్తు జననమే ఒక సందేశమని ఎలాంటి సమస్యకైనా బైబిల్ చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం విజయవాడ నగరంలోని సెయింట్ పాల్స్ బెసిలికా చర్చి క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు.

12/26/2018 - 15:23

విజయవాడ, డిసెంబర్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతి శ్వేతపత్రం పై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మంగళవారం సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ఎంతో మెరుగుపరిచామని, ఆర్థిక అసమానతలు తొలగిపోయాయంటూ ముఖ్యమంత్రి విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవ దూరంగా ఉందన్నారు.

12/26/2018 - 03:48

అమరావతి, డిసెంబర్ 25: పౌరులే కేంద్రంగా సమానత ప్రాతిపదికగా స్వర్ణాంధ్ర లక్ష్యంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమతుల్యత సాధించేందుకు విజన్-2029 నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో సంక్షేమంపై శే్వతపత్రం-3ను విడుదల చేశారు. అందులో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

12/26/2018 - 03:47

విజయవాడ, డిసెంబర్ 25: సాంకేతికత వినియోగంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు తయారీ రంగంలోనూ నిపుణులైన ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే జర్మనీకి చెందిన రోబోల తయారీలో అపార అనుభవం ఉన్న యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

12/26/2018 - 03:45

గుంటూరు, డిసెంబర్ 25: రాష్ట్భ్రావృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధిని సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను టీడీపీ నాయకులు అడ్డుకోవాలని చూడటం హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

12/26/2018 - 03:29

రాజమహేంద్రవరం, డిసెంబర్ 25: గోదావరి జిల్లాలు కోడి పందేలకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సంప్రదాయం పేరిట ఏటా మూడు రోజులు ఈ రెండు జిల్లాల్లో జూదాల జాతర కొనసాగడం ఆనవాయతీ అనేది అందరికీ తెలిసిందే. సంక్రాంతి సీజనుకు మరో రెండు వారాలు మాత్రమే ఉండటంతో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. పందేల సీజను సమీపించడంతో ఎక్కడ చూసినా పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి.

Pages