S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/22/2018 - 22:41

విజయవాడ, డిసెంబర్ 22: మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీకి మైనార్టీలంతా మద్దతునివ్వాలని మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ పిలుపునిచ్చారు. విజయవాడ బీజేపీ నగర కార్యాలయంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అన్సారీ పాల్గొనగా, జాతీయ ప్రధాన కార్యదర్శి అక్రమ్, జాతీయ కార్యదర్శి షేక్ బాజీ, తదితరులు హాజరయ్యారు.

12/22/2018 - 22:40

విశాఖపట్నం, డిసెంబర్ 22: లైంగిక వేధింపుల ఆరోపణలను ఒక కోణం నుంచి చూసి, నిజమని భావించి గుడ్డిగా సమర్థించడం సరికాదన్నది తన అభిప్రాయంగా సినీ నటుడు అరవింద స్వామి పేర్కొన్నారు. ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ సందర్భంగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లైంగిక వేధింపులపై ఒకరు మరొకరిపై ఆరోపణలు చేయడం మొదలు కాగానే తాము సైతం అంటూ మరికొంతమంది తెరపైకి వస్తున్న సందర్భాలను ఆయన తప్పుపట్టారు.

12/22/2018 - 22:38

గిద్దలూరు, డిసెంబర్ 22: ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గోపినాథపురంలో జరుగుతున్న 328వ రోజు ప్రజా సంకల్పయాత్రలో అన్నా వెంకటరాంబాబు శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

12/22/2018 - 16:42

విశాఖపట్నం:ఎన్నికల తరువాతే ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారంనాడిక్కడ ఇండియాటుడే సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్‌ది వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. మోదీ విధానాలు నచ్చకే, తమ హక్కుల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని వెల్లడించారు. రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటూ మోదీ తమపై దాడి చేస్తున్నారని అన్నారు.

12/22/2018 - 02:07

విజయవాడ, డిసెంబర్ 21: ఎన్నికల వరకూ పార్టీలో ఎమర్జెన్సీ అని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి పలువులు మంత్రుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల నేతలు గైర్హాజరుపై మండిపడ్డారు. ఏపీని గందరగోళం చేసేందుకే కేసీఆర్ పర్యటనలంటూ విమర్శించారు.

12/22/2018 - 02:04

హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని టీడీపీ సాంస్కృతిక శాఖ విభాగం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. నీరుకొండలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఏర్పాటు చేస్తుంటే గ్రాఫిక్స్ మాయాజాలమని అనడం గర్హనీయమన్నారు. ఎన్నికల కోసమే చంద్రబాబు హడావుడిగా ప్రయత్నాలని ఆమె చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

12/22/2018 - 01:26

విజయవాడ(సిటీ), డిసెంబర్ 21: భారత ఉపరాష్టప్రతి ముత్తవరపు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారయ్యింది. జనవరి 4వ నుండి 6వ తేదీ వరకు ఏపీలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ ప్రోటోకాల్ అడిషనల్ సెక్రటరీ ఎం అశోక్‌బాబు తెలిపారు. జనవరి 4 వతేది సాయంత్రం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకుంటారు.

12/22/2018 - 01:25

విజయవాడ(సిటీ), డిసెంబర్ 21: నిండు ఆరోగ్యం...ఆనందాలతో హాయిగా ఉండాలంటూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ 47వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం చంద్రబాబు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. జగన్ తిరిగి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

12/22/2018 - 01:25

అమలాపురం/కాకినాడ సిటీ, డిసెంబర్ 21: ఇటీవల సంభంవించిన పెథాయ్ తుపాను కారణంగా తూర్పు గోదావరి జిల్లా కేజీ బేసిన్‌లోని ఓన్‌జీసీ రిగ్గుకు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ ఆఫ్‌షోర్‌లో నెంబర్ 98/2 ప్రదేశంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను తవ్వేందుకు ఇటీవల నూతనంగా రిగ్‌ను ఏర్పాటుచేశారు. తుపాను కారణంగా వీచిన ఈదురు గాలులకు రిగ్గు ఒకపక్కకు ఒరిగిపోయింది.

12/22/2018 - 01:22

గుంటూరు, డిసెంబరు 21: గుంటూరు జిల్లా పల్నాడులో మావోయిస్టుల పేరుతో వెలుస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మావోయిస్టుల పేరుతో లేఖలు రావడంపై అటు ప్రజలు, ఇటు ప్రజాప్రతిధులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం మావోయిస్టుల పేరుతో లేఖలు రావడాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు.

Pages