S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/20/2018 - 12:47

విజయవాడ: పోలవరంపై వైకాపా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణంపై కేంద్రం కూడా సంతృప్తిని వ్యక్తంచేసిందని అన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

12/20/2018 - 04:50

అమరావతి, డిసెంబర్ 19: నాలుగున్నరేళ్ల రాష్ట్ర ప్రగతిపై సవివరణాత్మక నివేదికలతో 9 శే్వతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక శాఖాధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.

12/20/2018 - 04:49

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో మధ్య, చిన్నతరహా కంపెనీలకు కూడా ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం నగరంలోని మహానాడు రోడ్డులో కే బిజినెస్ స్పేసెస్ కార్యాలయంలో ఏపీ ఆన్‌లైన్ కంపెనీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

12/20/2018 - 04:47

అమరావతి, డిసెంబర్ 19: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) 2019 సంవత్సరానికి దేశం మొత్తంగా వివిధ ప్రాజెక్ట్‌లను ప్రామాణికంగా తీసుకుని పోలవరం పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అవార్డుకు ఎంపిక చేసింది.

12/20/2018 - 04:41

విజయవాడ (సిటీ), డిసెంబర్ 19: అనంతపురం జిల్లా మడకశిర శాసనసభ్యునిగా తిప్పేస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా చేయడంతో గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన వైసీపీకి చెందిన తిప్పేస్వామితో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

12/20/2018 - 04:39

అమరావతి, డిసెంబర్ 19: పెథాయ్ తుపాను కారణంగా రాష్ట్రంలో 74వేల 432 ఎకరాల్లో 243.54 కోట్ల రూపాయల విలువైన పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. వాటిలో 60వేల 285 ఎకరాల్లో రూ. 115.02 కోట్ల మేర వ్యవసాయ పంటలు, 14వేల 147 ఎకరాల్లో రూ. 128.52 కోట్ల మేర ఉద్యానవన పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయన్నారు.

12/19/2018 - 17:07

నెల్లూరు: శ్రీహరి కోట నుంచి జీఎస్వీఎల్ ఎఫ్11 వాహన నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ వాహన నౌక ద్వారా జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన దీన్ని భారతదేశం పంపిన 35వ సమాచార ఉపగ్రహం.

12/19/2018 - 17:04

అమరావతి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన టీడీపీ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ మళ్లీ రావాలి అనే నినాదంతో కర్యాకర్తలు ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ‘సెమీ క్రిస్మస్ వేడుకలు, 30న జరిగే జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

12/19/2018 - 17:03

అనంతపురం: జిల్లాలోని మడకసిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు అసెంబ్లీలో బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కృష్ణాజలాలను హంద్రీనీవా ద్వారా తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.

12/19/2018 - 13:50

విశాఖపట్నం: ఆంధ్ర పోలీసులకు చుక్కలు చూపించిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు విశాఖ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేయాల్సింది ఉందని అన్నారు. చెడ్డీ-బనియన్ ధరించి చోరీలకు పాల్పడే ఈ ముఠా గుజరాత్‌కు చెందినది. ఏపీలోని నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నంతో పాటు తమిళనాడు, తెలంగాణలలో చోరీలకు పాల్పడ్డారు.

Pages