S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/18/2018 - 04:34

రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెథాయ్ పెను తుపాను ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం కాకినాడ-యానాం నడుమ తీరం దాటింది. తొలుత తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన తుపాను ముందుకు కదిలి కాకినాడ-యానాం మధ్య తీరం దాటింది.

12/18/2018 - 04:33

విజయవాడ, డిసెంబర్ 17: నెదర్లాండ్స్ రాయబారి మార్టిన్ వాన్ డెన్ బెర్క్, 17 మంది కంపెనీ ప్రతినిధులతో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెలగపూడి సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కాబోతున్నారు.

12/18/2018 - 04:32

మడకశిర, డిసెంబర్ 17: అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే టి.ఈరన్నపై అనర్హత వేటు నేపధ్యంలో రెండవ స్థానంలో నిలిచిన వైకాపా అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నుంచి కబురు అందింది. ఈనెల 19వ తేదీ కలవాలని అపాయింట్‌మెంట్ లభించింది.

12/18/2018 - 04:31

గుంటూరు, డిసెంబర్ 17: రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అధునాతన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు నూతన విధానానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వైద్యం అందించే సమయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు, ఆసుపత్రిలో రోగుల రద్దీని తగ్గించేందుకు పేషంట్ యాక్సిస్ కార్డు విధానానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

12/18/2018 - 04:30

తిరుపతి, డిసెంబర్ 17: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యార్థులకు జీఓ 16 మేరకే ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం తిరుపతి స్వర్ణముఖి అతిథిగృహంలో మంత్రి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వ్యవసాయ కళాశాల విద్యార్థుల సంఘం నాయకులు మంత్రిని కలిసి జీఓ 16పై వినతిపత్రం అందించారు.

12/18/2018 - 04:30

విజయవాడ, డిసెంబర్ 17: వేతన సవరణ, తదితర కోర్కెల పరిష్కారం కోరుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో (పీఏసీఎస్) పని చేస్తున్న ఉద్యగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. సీఐటీయు అనుబంధ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లారుూస్ యూనియన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.

12/18/2018 - 03:53

విజయవాడ, డిసెంబర్ 17: సబ్సిడీ తగ్గింపు కేవలం డిసెంబర్ 7 తరువాత మంజూరైన గోకులాలకు మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చే శారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గోకులాల ఏర్పాటుకు ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలపై ప్రజల్లో అపోహలు ఉన్నాయన్నా రు.

12/18/2018 - 03:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఊహించని విపత్తులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి బీజేవైఎం విజ్ఞప్తి చేసింది. సోమవారం బీజేపీ ఎమ్మెల్యే సత్యనారాయణ, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు, కేంద్ర నౌకాయాన, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.

12/17/2018 - 16:40

విజయవాడ: పెథాయ్ తుపాను వల్ల కోనసీమలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో భారీవర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. చాలా కొబ్బరిచెట్లు, సెల్ టవర్లు కుప్పకూలాయి. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.

12/17/2018 - 16:38

విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు డ్రైనేజీ తవ్వకాల కోసం గుంతలు తీయటంతో డ్రైనేజీ నీరు, వర్షం నీరు చేరటంతో చిట్టినగర్, ఇస్లాంపేట, వన్‌టౌన్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.

Pages