S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/16/2018 - 06:02

విజయవాడ, నవంబర్ 15: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ గృహ వసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇక నేరుగా డీపీఆర్‌వోలకే దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు.

11/16/2018 - 06:32

విజయవాడ: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 800 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడుతుందన్నారు.

11/16/2018 - 06:00

విజయవాడ, నవంబర్ 15: పల్లెటూర్లను ప్రగతి రహదారులుగా తీర్చిదిద్దాలని, రాష్ట్రంలో రహదారి లేని ఊరు ఉండకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రామీణ బీటీ రోడ్ల మరమ్మతులను 2568 కోట్ల రూపాయలతో, 3576 కోట్ల రూపాయలతో కొత్త రోడ్లను నిర్మించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

11/16/2018 - 01:52

విజయవాడ, నవంబర్ 15: రానున్న 100 రోజుల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ పనితీరును గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మూడు నెలలు గృహ నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలన్నారు.

11/16/2018 - 01:51

గుంటూరు, నవంబర్ 15: ఇటీవల కాలంలో ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మావోల పేరిట ప్రత్యక్షమైన లేఖలు కలకలం రేపాయి. ఒకప్పుడు పల్నాడు ప్రాంతం మావోలకు అడ్డాగా ఉండేది. అయితే కాలక్రమేణా చోటుచేసుకున్న పరిణామాలతో దాదాపు మావోలు కనుమరుగయ్యారన్న ధీమాతో ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

11/16/2018 - 01:48

గుంటూరు, నవంబర్ 15: వేలకిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిపై ఈగ వాలనీయకుండా భద్రత కల్పిస్తున్న రాష్ట్ర పోలీసులను అవమానించేలా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు.

11/16/2018 - 01:25

పల్లెటూర్లను ప్రగతి రహదారులుగా తీర్చిదిద్దాలని, రాష్ట్రంలో రహదారి లేని ఊరు ఉండకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రామీణ బీటీ రోడ్ల మరమ్మతులను 2568 కోట్ల రూపాయలతో, 3576 కోట్ల రూపాయలతో కొత్త రోడ్లను నిర్మించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

11/15/2018 - 06:47

ఎన్నికల భూమి
===========
బోథ్ నియోజకవర్గం 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బోథ్ నియోజకవర్గం

11/15/2018 - 02:18

సూళ్లూరుపేట, నవంబర్ 14: వరుస రాకెట్ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు పాకడమే కాకుండా మంచి గుర్తింపుసైతం సంపాదించుకొంది. ఇక్కడ నుండి ప్రయోగించే ప్రతి రాకెట్ స్వదేశీ పరిజ్ఞానం కావడం ఒకవంతైతే వినూత్న ప్రయోగాలు చేపట్టి మన శాస్తవ్రేత్తలు ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్నారు.

11/15/2018 - 05:44

విజయవాడ: విజయవాడలో అంతర్జాతీయ బోట్ రేసింగ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణానది పున్నమి ఘాట్‌లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో అంతర్జాతీయ స్పీడ్ బోట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ రేసర్లు బోట్లతో సహా విజయవాడ చేరుకున్నారు. వాస్తవానికి ఇలాంటి బోట్‌రేస్‌లు ఇప్పటి వరకు లండన్, పోర్చుగల్, ఫ్రాన్స్, చైనా దేశాల్లోనే జరిగాయి.

Pages