S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/12/2018 - 02:14

విజయవాడ, నవంబర్ 11: సానుభూతి కోసం మాత్రమే వైఎస్ విజయమ్మ పచ్చి అబద్ధాలు చెబుతోందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసీరెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, కానీ ఆ పార్టీ మాత్రం నియంతృత్వ ధోరణితో వైఎస్ కుటుంబాన్ని పట్టించుకోలేదని విజయమ్మ చేసిన వ్యాఖ్యలను పచ్చి అబద్ధాలంటూ ఆదివారం ఆయన ఇక్కడ ఒక ప్రకటనలో ఖండించారు.

11/11/2018 - 04:08

నర్సీపట్నం, నవంబర్ 10: విశాఖ భూ కుంభకోణంలో ప్రమేయం ఉన్న అధికారులు నోరు విప్పితే అసలు సూత్రధారులెవరో బయటపడుతుందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిట్ నివేదిక తనకు సంతృప్తిని కలిగించిందన్నారు. అయితే ఈ కుంభకోణంలో ఇరుక్కున్న అధికారులు తమపై ఎవరు వత్తిడి తెచ్చారో ఇప్పటికైనా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

11/11/2018 - 03:56

విశాఖపట్నం, నవంబర్ 10: విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగును నియంత్రించేందుకు డ్రోన్‌లను వినియోగించనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ పీ లక్ష్మీనరసింహం వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్‌లో ఎక్సైజ్, పోలీసు, ఐటీడీఏ, అటవీ అధికారులతో శనివారం నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ శాటిలైట్ చిత్రాల ద్వారా గంజాయి సాగుజరుగుతున్న గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి దాడులు చేపట్టేవాళ్లమని పేర్కొన్నారు.

11/11/2018 - 03:53

నరసాపురం, నవంబర్ 10: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జక్కంశెట్టి వెంకటేశ్వరరావు (83) శనివారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని పెనుగొండ నియోజవర్గం నుంచి ఆయన 1978లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతేకాక శాసనపక్ష బీసీ కమిటీ ఛైర్మన్‌గా జక్కంశెట్టి వ్యవహరించారు. రాజకీయంలో చురుగ్గా ఉంటూనే న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

11/11/2018 - 03:51

తిరుపతి, నవంబర్ 10: ఎస్వీ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని, డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారకులైన ముగ్గురు డాక్టర్లకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి, వారిని అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు శాంతారెడ్డి డిమాండ్ చేశారు.

11/11/2018 - 03:50

విజయవాడ, నవంబర్ 10: రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీల పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఇక 15 రోజులు సాధారణ సెలవులు వినియోగించుకోటానికి అనుమతిస్తూ సొసైటీ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

11/11/2018 - 03:50

విజయవాడ, నవంబర్ 10: వేతన సవరణ, తదితర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2038 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో (పీఏసీఎస్‌లు) పని చేస్తున్న ఆరువేల మంది ఉద్యోగులు ఈ నెల 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నారు.

11/11/2018 - 03:49

విజయవాడ, నవంబర్ 10: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని స్థాయిల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిగా పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీ అనుబంధ సంస్థలన్నింటికీ పూర్తిస్థాయిలో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు.

11/11/2018 - 03:49

తిరుపతి, నవంబర్ 10: పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి 2014లో ఇచ్చిన విభజన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు.

11/11/2018 - 03:48

తిరుపతి, నవంబర్ 10: శేషాచల కొండల్లోని విలువైన ఎర్రచందనం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర అటవీశాఖ మంత్రి మహేష్ శర్మ అన్నారు. శనివారం తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఆయనకు తిరుగుప్రయాణంలో తిరుపతిలోని ఎర్రచందనం గోడౌన్‌ను పరిశీలించారు. ఎర్రచందనం గ్రేడింగ్ గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Pages