S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/08/2018 - 12:35

అమరావతి: తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కివచ్చిందని టీటీడీపీ నేత రమణ అన్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలిసేందుకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాకూటమిని చూస్తే కేసీఆర్‌కు భయం పట్టుకుందని, రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్నారు.

11/08/2018 - 12:33

అమరావతి: గ్రామదర్శినిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే ముందుందని అన్నారు. నాలుగున్నరేళ్ల మన కృషికి ఇదే నిదర్శనమని చెప్పారు.

11/07/2018 - 03:27

విజయవాడ(సిటీ), నవంబర్ 6: గనులు తవ్వి ఎలుకను పట్టినట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలో బాక్సైట్‌ను తవ్వేశారని, ఈ లీజులపై సమగ్ర విచారణ జరిపించాలని పవన్‌కళ్యాణ్ సోషల్ మీడియాలో డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై మంత్రి లోకేష్ మంగళవారం ట్టిట్టర్ వేదికగా స్పందించారు.

11/07/2018 - 03:25

విశాఖపట్నం, నవంబర్ 6: విశాఖ ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ (ఏఎంవీఐ) శరగడం వెంకటరావు ఆస్తులపై సోదాలు నాలుగవ రోజు కొనసాగాయి. వెంకటరావుకు చెందిన బ్యాంకు లాకర్లను సోమవారం తెరచిన అధికారులు కిలోల కొద్దీ బంగాలు, వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు.

11/07/2018 - 03:20

గుంటూరు, నవంబర్ 6: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును టీడీపీ సభ్యుడిగా పేర్కొంటూ మార్ఫింగ్ చేసిన సభ్యత్వ కార్డును ప్రచారం చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేషన్‌ను గుంటూరు అరండల్‌పేట పోలీసులు మంగళవారం విచారించారు. శ్రీనివాసరావు టీడీపీ సభ్యుడేనంటూ సభ్యత్వ కార్డు చూపిస్తూ జోగి రమేష్ విలేఖరుల సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే.

11/07/2018 - 03:20

విజయవాడ, నవంబర్ 6: రాజధానిలో రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ డీ లక్ష్మీ పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఏడీసీ అధికారులతో కలిసి ఈ-2, ఈ-4, ఎన్-17, ఎన్-16, ఎన్-11 రహదార్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ రహదార్లలో అంతర్భాగంగా నిర్మిస్తున్న పవర్ డక్ట్‌లు, వరద నీటి కాలవల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

11/07/2018 - 03:19

విజయవాడ, నవంబర్ 6: కరవు ప్రాంత కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్టును నిర్మించాలని కోరుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం బాగా వెనుబడిన కరవు ప్రాంతమన్నారు.

11/07/2018 - 02:03

విజయవాడ, నవంబర్ 6: అమరావతిలో స్టార్టప్స్ వేగం పెంచేందుకు ‘సెడిబస్’ ఎంతో దోహదపడుతుందని ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంకుర పరిశ్రమలకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇదో వేదిక అవుతుందన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని నిడమనూరు ప్రాంతంలో మాలక్ష్మీ హబ్ బిల్డింగ్‌లో సెడిబస్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

11/07/2018 - 02:01

పిఠాపురం, నవంబర్ 6: రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న పాపాలు పండే రోజు వచ్చిందని, ఏదో ఒకరోజు వారు చింతకాయల్లా రాలిపోతారని, టపాసుల్లా పేలిపోతారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు దారుణంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల అక్రమాలకు ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా ఉండటం సిగ్గుచేటన్నారు.

11/07/2018 - 04:27

అమరావతి: విశాఖపట్నంలో జరిగిన భూముల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన 300 పేజీల నివేదికపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చ జరిగింది. సిట్ నివేదికను ఆమోదిస్తూ సిఫార్సుల అమలుకు ముగ్గురు ప్రభుత్వ కార్యదర్శులతో త్రిసభ్య కమిటీని నియమించేందుకు మంత్రిమండలి ఆమోదించింది.

Pages