S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/21/2017 - 01:08

మదనపల్లె, ఏప్రిల్ 20 : వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత ప్రియుడి సహకారంతో కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తుండగా, చూస్తుండలేకపోయిన స్థానికులు వారిద్దరికీ దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం రాత్రి మదనపల్లె పట్టణ శివారుప్రాంతంలో చోటుచేసుకుంది. చిత్తూరుజిల్లా మదనపల్లె రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన భాగ్యమ్మకు ఒక కుమార్తె ఉంది.

04/21/2017 - 01:07

విశాఖపట్నం, ఏప్రిల్ 20: ఝూర్‌ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ భూ ఉపరితలంపై అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఒకటి,రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది.

04/21/2017 - 01:06

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 20: నమ్మకంగా ఒకరికి ఇచ్చిన రూ.14 లక్షల బాకీ వసూలు కాకపోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

04/20/2017 - 05:22

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 19: మన్యం ప్రాంతంలో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది..వేసవికి ముందే తాగునీటి కొరత తలెత్తింది. పోలవరం ముంపు మండలాల్లో తాగునీటి పధకాలు మూలనపడ్డాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల ద్వారా కోట్ల నిధులు ఖర్చు పెట్టిన వైనం కాస్తా నిరుపయోగంగానే మారింది. ఏటికేడాది తాగునీటి సమస్యలు జఠిలంగా మారుతున్నా పట్టించుకుంటోన్న పరిస్థితి కన్పించడంలేదు.

04/20/2017 - 05:21

శ్రీకాకుళం, ఏప్రిల్ 19: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు లేలేత భానుడి కిరణాలతో అటు ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యకర ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ విదేశీయుడి నమ్మకం. సూర్యుడు అన్ని ప్రాంతాలకు మార్గదర్శకుడని,సాంకేతికతకు మూలాధారమని రొమేనియా దేశానికి చెందిన మానసిక శాస్త్ర నిపుణుడు స్ట్ఫోన్ సూర్యనమస్కారాలు నేర్చుకునేందుకు అరసవల్లి వచ్చారు.

04/20/2017 - 05:02

భీమవరం, ఏప్రిల్ 19: పాడి పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాడి రైతుకు భరోసాగా ఉండాలని నిర్ణయించింది. పశువులను పెంచే రైతుకు సౌకర్యాలు కల్పిస్తేనే అటు వ్యవసాయం ఇటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పనులు ఉపాధి హామీ నిధులతో చేసుకునే అవకాశం కల్పించింది.

04/20/2017 - 04:41

విజయవాడ, ఏప్రిల్ 19: వీధి బాలలకు విద్యా, ఆరోగ్య సాధికారత, గౌరవ ప్రదమైన జీవన విధానాలకు మెప్మా రూపకల్పన చేసిన రాగ్ పికర్స్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. చిత్తు కాగితాలు ఎరుకునే వీధి బాలల జీవన విధానం తదితర అంశాలపై ఈ పుస్తకాన్ని రూపొందించారు.

04/20/2017 - 04:21

నంద్యాల సీటు వెరీ హాటు బాబును కలిసిన అఖిల, శిల్పా బ్రదర్స్
24న అభ్యర్థిని ప్రకటిస్తామని అఖిల ఏకపక్ష ప్రకటన
పోటీ ఖాయమని తేల్చి చెప్పిన శిల్పా సీటు ఇవ్వకపోతే వైసీపీలోకి..

04/20/2017 - 04:18

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 23 నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాల క్యాలెండర్‌కు ఒక రోజు ముందే పాఠశాలలు మూతపడనున్నాయి. ఎండ ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది 1 నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు గత నెలలో ముగిసినప్పటికీ, ప్రత్యేక తరగతులను ఈ నెల రోజుల కాలంలో నిర్వహించారు. దీంతో పరీక్షలు ముగిసినప్పటికీ, దాదాపు మూడు వారాల పాటు పాఠశాలలు పనిచేశాయి.

04/19/2017 - 01:17

ఫలితాల ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు విభజనతో సేవల రంగంలో వెనుకబడ్డాం
ఏడు ఆదాయ ఆర్జనశాఖ అధికారులతో బాబు సమీక్ష నోట్ల రద్దువల్లే ఆదాయం రాలేదన్న అధికారులు

Pages