S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/16/2018 - 03:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: తెలుగుదేశం నాయకులపై ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విమర్శలు చేయిస్తోందని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఢిల్లీలో ఏపీ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రతి దానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10/16/2018 - 03:39

విజయవాడ, అక్టోబర్ 15: తిత్లీ తుపాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి, జీడిమామిడి తదితర తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేరళకు చెందిన సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) ముందుకు వచ్చింది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఈ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

10/16/2018 - 03:39

గుంటూరు, అక్టోబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్మికులు అర్ధాకలితో అలమటించే వారని, నేడు రాష్ట్భ్రావృద్ధిలో కీలకపాత్ర పోషించే కార్మిక సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కేశినేని నాని తెలిపారు.

10/16/2018 - 03:38

విజయవాడ, అక్టోబర్ 15: రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ బ్యాంక్‌ల నుంచి 10 వేల కోట్ల రూపాయలను రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈ రుణానికి గ్యారంటీర్‌గా వ్యవహరించనున్నట్లు సీఆర్‌డీఏకు తెలిపింది. ఈ రుణాన్ని, వడ్డీని సీఆర్‌డీఏ చెల్లించాల్సి ఉంటుందని సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

10/16/2018 - 03:38

విజయవాడ, అక్టోబర్ 15: తిత్లీ తుపాను బాధితుల సహాయార్ధం బాలయ్య అభిమానులు రూ.1.71 లక్షల రూపాయలు విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోమవారం అందచేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మనబాలయ్యడాట్‌కామ్ నిర్వాహకుడు పి.గౌతం ఈ మేరకు విరాళాన్ని అందచేశారు. తుపాను బాధితుల సహాయార్థం కళాశాల అధ్యాపకుల ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఫెడరేషన్ ఆఫ్ ఏపీ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అందచేసింది.

10/16/2018 - 03:37

విజయవాడ, అక్టోబర్ 15: శ్రీకాకుళంలో తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మృతులకు 5 లక్షల రూపాయలు, వరికి హెక్టారుకు 20 వేల రూపాయలు, అరటి పంటకు 30 వేల రూపాయలు, కొబ్బరి చెట్టుకు 1200 రూపాయలు, జీడిమామిడికి హెక్టారుకు 25 వేల రూపాయలు ప్రకటించింది.

10/16/2018 - 03:31

కడియం, అక్టోబర్ 15: ఏటా వరదల సమయంలో ఉగ్ర గోదావరి పరవళ్లకు కేంద్రబిందువయ్యే తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని చారిత్మ్రాతక కాటన్ బ్యారేజీ సోమవారం తొలిసారిగా జనగోదావరి తాకిడిని చవిచూసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇ చ్చిన పిలుపుతో రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్య లో జనసేన కార్యకర్తలు, అభిమానులు తూర్పు గోదావరి జిల్లా పిచ్చుకలంక తరలివచ్చారు.

10/16/2018 - 03:28

గుంటూరు, అక్టోబర్ 15: దక్షిణ భారతీయులను అవమానించడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం గుంటూరులోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కన్నా మాట్లాడుతూ పంజాబ్ మంత్రి నవజ్యోతిసింగ్ సిద్ధూ దక్షిణ భారతదేశానికి వెళ్లడం కంటే పాకిస్థాన్‌కు వెళ్లడమే నయమని వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు.

10/16/2018 - 03:23

విజయవాడ, అక్టోబర్ 15: యుద్ధప్రాతిపదికన తిత్లీ తుపాను సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్టీజీఎస్ నుంచి సహాయక చర్యల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేదికలు రప్పించుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటికీ ఆర్టీసీ బస్సు సర్వీసులను సోమవారం పునరుద్ధరించారు. 393 సర్వీసులు పునరుద్ధరించారు.

10/16/2018 - 03:22

మేదరమెట్ల, అక్టోబర్ 15 : ప్రముఖ సినీనటుడు గిరిబాబు తండ్రి యర్రా నాగయ్య (108) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన పార్దివదేహాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 108 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పటికీ గ్రామస్థులతో చలాకీగా తిరుగుతూ మాట్లాడుతూ కలివిడిగా ఉండే నాగయ్య మృతి పట్ల గ్రామస్థులు, పరిసర గ్రామాల ప్రజలు సంతాపం తెలిపారు.

Pages