S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/15/2018 - 11:45

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆరో రోజైన సోమవారం కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

10/15/2018 - 11:43

విజయవాడ : శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు దుర్గగుడి ఆవరణలో గుండె పోటుతో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతుడు కృష్ణలంకకు చెందిన అనిల్‌గా గుర్తించారు.

10/15/2018 - 02:13

విజయవాడ, అక్టోబర్ 14: శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న తుపాను పునరావాస, సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తికరంగా లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి తుపాను సహాయక చర్యలపై ఆదివారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రతి ఒక్కరిలో సంతృప్తి రావాలన్నారు.

10/15/2018 - 02:12

విజయవాడ (సిటీ), అక్టోబర్ 14: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జనకవాతుకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాయలంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన కవాతు ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు.

10/14/2018 - 07:04

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులు డిసెంబర్‌లో చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని నవయుగ సంస్థ చేపట్టింది. ప్రస్తుతం మట్టి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కొండను తొలిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సివిల్ పనులు చేపట్టి పూర్తిచేయనున్నారు.

10/14/2018 - 07:08

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 13: దేశంలో నరేంద్రమోదీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రియదర్శిని కళాశాలలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

10/14/2018 - 07:08

విజయవాడ, అక్టోబర్ 13: దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రజలందరూ సంతోషించాల్సిన విషయమని విజయవాడలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు.

10/14/2018 - 07:01

విశాఖపట్నం, అక్టోబర్ 13: గీతం విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి సేవలు నిరుపమానమని పలువురు కొనియాడారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మూర్తి సంతాపసభలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించిన మూర్తితో కలిసి తాను పార్లమెంట్ సభ్యునిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.

10/14/2018 - 07:00

విజయవాడ, అక్టోబర్ 13: భౌగోళికంగా తరతూ తుపాన్ల బారిన పడే రాష్ట్రం ఏపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విపత్తుల వచ్చినా అధైర్యపడమని, ధైర్యంగా నిలబడి పరిస్థితులు చక్కదిద్దుకుంటామని వ్యాఖ్యానించారు. తిత్లీ తుపాను సహాయ చర్యలపై శ్రీకాకుళం నుంచి ఆయన శనివారం అధికారులతో, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు.

10/14/2018 - 06:59

విజయవాడ, అక్టోబర్ 13: తిత్లీ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. 50 మంది ఐఏఎస్ అధికారులను, 100 మంది డిప్యూటీ కలెక్టర్లను, మరో 136 మంది ఇతర అధికారులను శ్రీకాకుళానికి పంపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను వీలైనంత త్వరగా తీసుకువచ్చేందుకు ఈ అధికారులు తమ సేవలు అందించనున్నారు.

Pages