S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/14/2018 - 05:07

విజయవాడ, అక్టోబర్ 13: దసరా ఉత్సవాలు వేదికగా దుర్గగుడి ఈవో, పాలకమండలి సభ్యుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మవారి దర్శనానికి వెళ్లే దారిలో కొన్ని గేట్లకు తాళాలు వేయడంపై పాలక మండలి సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఆలయంలోని ఇతర మార్గాల కొంతమంది వెళ్తుండటంతో దానిని నియంత్రించేందుకు ఈవో కోటేశ్వరమ్మ ప్రయత్నిస్తున్నారు.

10/14/2018 - 05:06

విజయవాడ(సిటీ), అక్టోబర్ 13: రాజకీయ జవాబుదారీతనం లేని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక హోదాపై అక్కడ ప్రధాని మోదీ, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు మార్చారని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్‌కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే దానిపై ఎవరైనా సరే వివరణ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు. హామీలు నెరవేర్చని వారిని రీకాల్ చేసే వ్యవస్థ రూపొందాలన్నారు.

10/14/2018 - 05:03

కాకినాడ, అక్టోబర్ 13: నాలుగేళ్లుగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ వచ్చిన కాపు జేఏసీ ఇపుడు రిజర్వేషన్లతోపాటు మరో వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. కాపుల హక్కుల కోసమే జీవిస్తున్నట్టు ఇప్పటివువరకూ చెప్పుకున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇకపై దళితులతో కలిసి నడిచేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.

10/14/2018 - 05:01

గుంటూరు, అక్టోబర్ 13: పేదలకు ప్రాణదానం చేస్తున్న ఎన్‌టిఆర్ వైద్యసేవపై వైసీపీ నేతలు, అవాకులు, చవాకులు పేలడం వారి దివాళాకోరు తనానికి, చౌకబారు విమర్శలకు తార్కాణమని టీడీపీ ఎమ్మెల్యేలు కిమిడి మృణాళిని (చీపురుపల్లి), యామినీబాల (శింగనమల) పేర్కొన్నారు.

10/14/2018 - 05:08

శ్రీకాకుళం, అక్టోబర్ 13: జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఉద్దానం ప్రాంతానికి అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ బాధితులకు అండగా నిలిచి సాధారణ పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులుగా సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి పలాసకు మార్చేశారు.

10/14/2018 - 04:56

అవుకు, అక్టోబర్ 13: కర్నూలు జిల్లాలో విస్తరించిన ఎర్రమల కొండల్లో భూమి పొరల్లో మంటలు వస్తున్నాయి. అవుకు మండల పరిధిలోని కునుకుంట్ల మజారా గ్రామమైన మర్రికుంటతండా సమీపంలో ఎర్రమల కొండల్లో భూమి పొరల నుంచి మంటలు వచ్చాయి. గత రెండు రోజులుగా చీలిన భూమి పొరల నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో తహశీల్దార్ సంజీవయ్య శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

10/14/2018 - 04:54

విజయవాడ, అక్టోబర్ 13: సరిగ్గా మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు అన్నారు. ఈ విషయమై హైకోర్టులో రాష్ట్రానికి సంబంధించి కాస్తంత ఆలస్యంగా దాఖలు చేసిన పిటిషన్‌పై మరో పది రోజుల్లో తీర్పు రానున్నదన్నారు.

10/14/2018 - 04:53

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: జనసేన పార్టీ ఏపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ప్రదర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లాను ప్రతిష్టాత్మకంగా ఎంచుకుంది. ఏపీ ప్రజలకిచ్చిన వాగ్ధానాలు, హామీలు, మ్యానిఫేస్టో అంశాలు నెరవేరలేదని నిరసిస్తూ గోదావరి సాక్షిగా జనసైనికులు కవాతుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 15వ తేదీన ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై రెండున్నర కిలో మీటర్ల మేర కవాతు సాగనుంది.

10/13/2018 - 17:50

విజయవాడ: కనకదుర్గ ఈఓకి, పాలకమండలి సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. కొంతమంది భక్తులను అడ్డదారిలో పంపేందుకు కొన్ని గేట్లకు తాళాలు వేస్తున్నారని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారి దర్శనానికి రాగా పాలకమండలి సభ్యులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

10/13/2018 - 17:47

అమరావతి: తిత్లీ తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏఏ రంగాలకు ఎంత నష్టం వాటిల్లిందో ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

Pages