S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/14/2016 - 08:13

విజయవాడ, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గగుడిలో ప్రత్యేక దర్శనం టికెట్ ధరను 500 రూపాయలుగా నిర్ణయించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

08/14/2016 - 08:13

ఇబ్రహీంపట్నం/మైలవరం, ఆగస్టు 13: ఇప్పటి వరకూ తాను ఎనిమిది పుష్కరాలలో స్నానం చేసి జన్మధన్యం చేసుకున్నానని ఒక పండు వృద్ధురాలు తన అనుభూతిని ఆంధ్రభూమితో పంచుకుంది. ఇబ్రహీంపట్నానికి చెందిన చిలుకూరి స్వరాజ్యలక్ష్మి(90) అనే వృద్ధురాలు పోలీసుల సాయంతో ఇబ్రహీంపట్నంలోని సంగమం ఘాట్‌లో పుణ్యపుష్కర స్నానం చేయటానికి వచ్చింది. నడవలేని ఈమెను పోలీసులు వీల్ చైర్‌లో పుష్కర స్నానానికి తీసుకెళ్లారు.

08/14/2016 - 08:14

అమరావతి, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎక్కడా రాజీపడకుండా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించినట్లు రాష్ట్ర హోం మంత్రి, డెప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.

08/14/2016 - 08:14

మచిలీపట్నం, ఆగస్టు 13: కృష్ణానదీ జలాలతో పునీతమవుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా పుష్కరాలు శుభసూచకం కానున్నాయని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా శనివారం సాగర సంగమ క్షేత్రం వద్ద ఆయన శాసన మండలి ఉప సభాపతి బుద్ధప్రసాద్‌తో కలసి పుణ్యస్నానం ఆచరించారు.

08/14/2016 - 08:05

హైదరాబాద్, ఆగస్టు 13: దళితులపై దాడులను హిందూ మత పర్యవేక్షకులు, స్వామీజీలు కూడా బాధితులు పక్షాన నిలిచి ఖండించాలని తెలుగు దేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.

08/14/2016 - 07:04

హైదరాబాద్, ఆగస్టు 13: జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదికన చేస్తున్నారో, కొత్త జిల్లాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ముందుగా ముసాయిదా ప్రకటించాలని, ఆ తరువాతనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరిస్తే బాగుంటుందని విపక్షాలకు చెందిన శాసన సభ్యులు సూచించారు. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది.

08/14/2016 - 07:04

చిత్తూరు, ఆగస్టు 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం అసాధ్యమేనని, అయితే ప్రత్యేక హోదా కన్నా మెరుగైన సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి బిజెపి నేత పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు.

08/14/2016 - 07:03

విశాఖపట్నం, ఆగస్టు 13: అన్నివిధాలా ప్రగతి సాధించేందుకు వీలుగా విశాఖ జిల్లాలోని పలు మండలాల పరిధిలో వంద గ్రామాలను తాను దత్తత తీసుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భాగస్వామ్యంతో టిఎస్సార్ ట్రస్టు ఆధ్వర్యంలో దత్తత గ్రామాల అభివృద్ధి చేపడతామన్నారు.

08/14/2016 - 07:02

అనంతపురం, ఆగస్టు 13: రాష్టస్థ్రాయి 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు అనంతపురం నగరం ముస్తాబైంది. ఈనెల 15న అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం(పిటిసి)లో అంగరంగ వైభవంగా జెండా పండుగ నిర్వహించనున్నారు. గత 15 రోజులుగా కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లలో అన్నిశాఖల అధికారులు భాగస్వాములయ్యారు.

08/14/2016 - 04:24

విజయవాడ, ఆగస్టు 13: అణువణువునా పోటెత్తిన భక్తజనుల పవిత్ర స్నానాలతో కృష్ణవేణమ్మ పరవశించిపోయింది. అన్ని స్నాన ఘట్టాల్లోనూ కిటకిటలాడిన జనం భక్తితో చేస్తున్న పూజలకు ఆమ్మ పులకించిపోయింది. తొలిరోజు వరలక్ష్మీవ్రతం కారణంగా వెలవెలపోయిన స్నాన ఘట్టాలు రెండోరోజున నిండుగా కనిపించటంతో కృష్ణాజలాలు మిలమిల మెరుస్తూ కేరింతలు కొట్టాయి. ఎక్కడ చూసినా సంరంభమే.. ఒకవైపు నవదుర్గా హారతుల వైభవం..

Pages