S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/12/2018 - 03:57

విజయవాడ, అక్టోబర్ 11: జీవో నెం 279 రద్దు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రకటించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గురువారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

10/12/2018 - 03:57

గుంటూరు, అక్టోబర్ 11: భారతదేశం గర్వించదగ్గ న్యాయ కోవిదుడు పాటిబండ్ల చంద్రశేఖరరావు అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కొనియాడారు. పాటిబండ్ల చంద్రశేఖరరావు మృతి పట్ల ఎంపీ కనకమేడల నివాళులర్పించి ప్రగాడ సంతాపం తెలిపారు. పాటిబండ్ల మృతితో దేశం ఒక గొప్ప న్యాయకోవిదుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.

10/12/2018 - 01:59

గుంటూరు, అక్టోబర్ 11: దేశంలో అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరస్థుడిగా కోర్టులు పరిగణించిన వ్యక్తి రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని ఆరోపించడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

10/12/2018 - 01:58

విజయవాడ, అక్టోబర్ 11: సమస్యల పరిష్కారం కోసం గత 8 రోజులుగా సాగుతున్న మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. తెనాలి, తాడేపల్లిగూడెంల్లో కార్మికులపై లాఠీచార్జీ చేయడాన్ని కార్మికసంఘాల జేఏసీ ఖండించింది. లాఠీచార్జీకి కారకులైన అధికారులు, పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

10/11/2018 - 17:08

అమరావతి: అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూతనివ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

10/11/2018 - 17:06

తెనాలి: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదేండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన తెనాలి శాసనసభ నుంచి రెండు సార్లు ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో స్పీకర్‌గా పనిచేశారు. నాదేండ్ల మనోహర్ జనసేన పార్టీలో రేపు తిరుపతిలో అధికారికంగా చేరనున్నారు.

10/11/2018 - 12:44

శ్రీకాకుళం: తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జరగాల్సిన ఇంటర్ ఆఫ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు. తిత్లీ తుపాను వల్ల ఈ రెండు జిల్లాల్లో విద్యుత్, రవాణా వ్యవస్థ స్తంభించింది.

10/11/2018 - 12:43

విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారు మూడు సంవత్సరాల బాలికా రూపంలో దర్శనం ఇచ్చారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా అన్ని పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం. తొలిరోజు 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోగా రెండవరోజు భక్తులు రద్దీ తగ్గింది.

10/11/2018 - 12:41

తిరుమల: శ్రీవారి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజు స్వామివారు ఐదు పడగల చినశేష వాహనంపై ఊరేగారు. శ్రీకృష్ణుడి రూపంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చిన కళాకారులతో మాడ వీధులు కోలాహలంగా మారాయి.

10/11/2018 - 12:35

అమరావతి: ఉత్తరాంధ్రను కుదిపేసిన తిత్లీ తుపాను ప్రభావం, తీసుకోవల్సిన సహాయక చర్యలపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష జరిపారు. ఈరోజు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తుపాను తెరిపి ఇచ్చిన వెంటనే పునరావాస చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

Pages