S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/11/2018 - 15:49

శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను తీరాన్ని దాటింది. తుపాను తీరం దాటిన ప్రాంతాల్లో విస్తత్రంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం వల్ల గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

10/11/2018 - 06:54

రాజమహేంద్రవరం, అక్టోబర్ 10: కార్మిక చట్టాలను సరళీకరిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖా మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వర్ అన్నారు. 38 కార్మిక చట్టాలను నాలుగు విభాగాలుగా విభజిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించిన కార్మిక బీమా ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వర్ బుధవారం ప్రారంభించారు.

10/11/2018 - 06:52

రేణిగుంట, అక్టోబర్ 10: చెత్తద్వారా సంపదను సృష్టించే ఎస్‌డబ్ల్యూసీని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె సింగ్, ఆయన బృంద సభ్యులు అభినందించారు. చిత్తూరు జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 15వ ఆర్థిక సంఘం చైర్మన్, బృందం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్‌లోని చెత్తద్వారా సంపదను సృష్టించి ప్రకృతి సేద్యానికి అందిస్తున్న బృందావనంను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

10/11/2018 - 06:51

పాడేరు, అక్టోబర్ 10: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేయడానికి సహకరించిన వారు ఎంతటి వారినైనా శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసారు. విశాఖ జిల్లా పాడేరులోని కిడారి క్యాంపు కార్యాలయంలో ఆయన కుటుంభ సభ్యులను హోంమంత్రి చినరాజప్ప, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆనందబాబుతో కలిసి బుధవారం ఆయన పరామర్శించారు.

10/11/2018 - 06:56

విశాఖపట్నం, అక్టోబర్ 10: విశాఖ వేదికగా స్కూల్ సైకాలజీపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగే 8వ అంతర్జాతీయ సైకాలజీ సదస్సును ఇండియన్ స్కూల్ సైకాలజీ అసోసియేషన్, ఏయూ సైకాలజీ విభాగం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. సదస్సుకు మలేషియా పార్లమెంట్ సేనేట్ అధ్యక్షుడు విఘ్నేశ్వరన్ హాజరుకానున్నట్టు తెలిపారు.

10/11/2018 - 06:49

సూళ్లూరుపేట, అక్టోబర్ 10: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఆ దిశగా అంతిరక్ష ప్రయోగాలు చేపట్టడమే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లక్ష్యమని షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎం.బద్రినారాయణ మూర్తి అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో అంతరిక్ష నడక (స్పేస్‌వాక్) నిర్వహించి డీఆర్‌డీఎల్ కాలనీలో విద్యార్థులకు అవార్డుల ప్రదానం చేశారు.

10/11/2018 - 06:48

కాకినాడ, అక్టోబర్ 10: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటు హక్కు నమోదు ప్రక్రియను ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల యంత్రాంగం పెద్ద ఎత్తున చేపట్టింది. గోదావరి జిల్లాల్లోని అన్ని విద్యాశాఖ కార్యాలయాలు, మండల పరిషత్, తహశీల్దారు, పుర పాలక సంఘ కార్యాలయాల్లో ఓటు హక్కు నమోదు శిబిరాలను ఏర్పాటుచేశారు.

10/11/2018 - 03:43

అమరావతి, అక్టోబర్ 10: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసిన ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటమి భయంతోనే ఉప ఎన్నికలు జరక్కుండా బీజేపీ, వైసీపీలు కుట్రపన్నాయని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఉప ఎన్నికలు ఎందుకు జరగలేదో ప్రతిపక్షనేత జగన్ ప్రజలకు వివరించాలని బుధవారం ఒక ప్రకటనలో యనమల డిమాండ్ చేశారు.

10/11/2018 - 03:41

విజయవాడ (పాయకాపురం), అక్టోబర్ 10: కాంట్రిబ్యూటరీ పెన్షన్విధానం (సీపీఎస్) రద్దు చేయాలంటూ ఉద్యోగులు నిరాహార దీక్ష ప్రారంభించారు.

10/11/2018 - 03:39

కావలి, అక్టోబర్ 10: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీలోని కొత్తసత్రం రెడ్డిపాళెం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎకరం ప్రభుత్వ భూమి విషయంలో ఏర్పడిన వివాదం చివరికి 10 కుటుంబాలను గ్రామంనుంచి వెలివేసే స్థాయికి చేరింది. దాంతో బుధవారం బాధితులంతా కావలి డీఎస్పీ రఘు, ఆర్డీవో భక్తవత్సలరెడ్డిని కలసి తమ సమస్యను తెలిపి రక్షణ కల్పించాలని కోరారు.

Pages