S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/09/2018 - 00:06

అమరావతి, అక్టోబర్ 8: విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ఉన్న అడ్డంకులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తమకు వౌలిక వసతులులేవని కస్టమ్స్ అధికారులతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేచీ పెడుతున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమస్య పరిష్కారానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కస్టమ్స్ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.

10/09/2018 - 00:05

అమరావతి, అక్టోబర్ 8: మిల్లర్లలో క్రమశిక్షణ ఉండాలి..పద్ధతి ప్రకారం పనిచేయకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. రాష్ట్రం ధాన్యం సేకరించినా ఇప్పుడు తీసుకోబోమని కేంద్రం లేఖరాసిందని, ఒక సీజన్ నుంచి మరొక సీజన్ వరకు సాగదీస్తే ఎలా అని కేంద్రం ప్రశ్నిస్తుంటే మిల్లర్లు జాప్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

10/09/2018 - 00:02

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు
108 సర్వీస్ ప్రొవైడర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం
త్వరలో 190 కొత్త వాహనాలు
అంబులెన్స్ లొకేషన్ సమాచారానికి ప్రత్యేక యాప్
====================================

10/09/2018 - 00:01

విజయవాడ(సిటీ), అక్టోబర్ 8: ఏపీలో జలవనరులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా ఎఫ్ 1, హెచ్ 2 ఓ పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న మొదటి ప్రపంచ స్థాయి పోటీలు అయినందున ఈ జలక్రీడలను అందరూ మెచ్చేలా ఘనంగా నిర్వహించాలన్నారు.

10/08/2018 - 23:38

వేంపల్లె, అక్టోబర్ 8: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో రెండోవిడత ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల భవితవ్యం రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఎదుట ఉంది. హైకోర్టులో మంగళవారం దీనిపై విచారణ వాయిదా ఉండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

10/08/2018 - 23:35

విజయవాడ, అక్టోబర్ 8: రష్యాలోని కజాని నగరంలో వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఢిల్లీలోని ఎరోసిటీలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు ఇండియా స్కిల్స్ 2018 పేరుతో జాతీయ స్థాయి నైపుణ్య పోటీలు జరిగాయి. 46 ట్రేడ్స్, 10 ప్రాంతీయ నైపుణ్యాలు, 4 డెమో స్కిల్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 27 రాష్ట్రాల నుంచి 400 మందికి పైగా పాల్గొన్నారు.

10/08/2018 - 23:35

కాళ్ల, అక్టోబర్ 8: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరులో సోమవారం ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

10/08/2018 - 23:34

రాజమహేంద్రవరం, అక్టోబర్ 8: గ్రీన్ కవర్‌ను పెంచడం ద్వారా కర్బన్ ఉద్గారాల తగ్గింపు ప్రస్తుత తరుణంలో కీలకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ జెఎస్‌ఎన్ మూర్తి అన్నారు. కర్బన్ ఉద్గారాల తగ్గింపు, అటవీ ప్రాంతాల సాంద్రతను కాపాడటం అటవీ అధికారులకు సవాల్‌గా పరిణమించిందన్నారు.

10/08/2018 - 23:33

గుంటూరు, అక్టోబర్ 8: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లుండీ చూడలేని కబోధిలా ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శోభా హైమావతి ధ్వజమెత్తారు.

10/08/2018 - 23:33

గుంటూరు, అక్టోబర్ 8: బీజేపీ చేయించిన సర్వేలతో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఊహల్లో విహరిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

Pages