S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/17/2018 - 03:42

విజయవాడ, సెప్టెంబర్ 16: గత మూడు నెలలుగా మన్యం, మైదాన ప్రాంతం అనే తేడా లేకుండా తీవ్రమైన విషజ్వరాలు, డెంగ్యూ వల్ల పసిపిల్లలు, పెద్దలు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అన్యాయమని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విమర్శించారు.

09/17/2018 - 03:41

భీమవరం, సెప్టెంబర్ 16: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు స్వచ్ఛ సర్వేక్షణ్-2019కి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కమిషనర్లు ఆ ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి సర్వే ప్రారంభమవుతుంది. ఇందుకు నగరాలు, పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో మున్సిపల్ అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.

09/17/2018 - 03:41

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: ఇప్పటి వరకూ చేపట్టని వినూత్న కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించే విధంగా డాక్యుమెంటరీ, షార్ట్ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్టు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలియచేశారు. విశాఖ పార్టీ విభాగం ఈ పోటీలను నిర్వహించనుంది.

09/17/2018 - 03:40

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం గత నెల 29న ప్రారంభమైన బస్సుయాత్రలకు ముగింపుగా శనివారం రాత్రి విజయవాడలో జరిగిన మహాగర్జన విజయవంతమైందని, సభను జయప్రదం చేసిన రాష్ట్ర ప్రజానీకానికి సీపీఐ, సీపీఎం తరపున రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పెనుమల్లి మధు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

09/17/2018 - 03:36

విజయవాడ, సెప్టెంబర్ 16: రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని చైనాలోని తెలుగువారికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా ఆయన చైనా తెలుగు అసోసియేషన్ సభ్యులతో ఆదివారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు కలిసే ఉన్నారన్నారు. తెలుగువారు ఎక్కుడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.

09/17/2018 - 03:33

గుంటూరు, సెప్టెంబర్ 16: ఆపరేషన్ గరుడలో ఐవైఆర్ కృష్ణారావు కీలక పాత్రధారి అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కోకన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆరోపించారు. ఆదివారం గుంటూరులోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని విమర్శించారు.

09/17/2018 - 03:34

విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 16: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు ఎన్నో కేసుల్లో స్టేలు తెచ్చుకొని తానేదో నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, ముడుపులు లేకుండా ఏ ప్రాజెక్టూ అమలు కావటం లేదని ఆరోపించారు. తాను మాట్లాడితే నిజాయతీ, అవతలి వాళ్లు మాట్లాడితే సత్యదూరమని విమర్శించటం విడ్డూరమన్నారు.

09/17/2018 - 03:25

విజయనగరం, సెప్టెంబర్ 16: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొమరాడ మండలం విక్రంపురం-ఆర్తాం రిజర్వ్ ఫారెస్టులోఏనుగులు తిష్టవేశాయి. గత వారం రోజులుగా ఈ ఏనుగులు జనావాసాల్లో తిరుగుతుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. గత వారం రోజులుగా ఎనిమిది ఏనుగుల గుంపు ఏజెన్సీ మండలాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

09/17/2018 - 03:23

అమరావతి, సెప్టెంబర్ 16: వరదల బీబత్సంతో ఆపదలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని పెద్దమనసుతో ఆదుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.

09/17/2018 - 03:21

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో కాపులు, బహుజనులు ఒకటైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఆ దిశగా ఆలోచనతో ఐక్యతకు కృషిచేయాలని పలువురు మేధావులు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి దళిత, బహుజన, మైనార్టీ, కాపు(డీబీఎంకే) రాజకీయ చైతన్య వేదిక సమావేశంలో ఈమేరకు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు.

Pages