S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/21/2018 - 04:40

అమరావతి, ఆగస్టు 20: రాష్ట్రంలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రతి నెలా నాలుగో శనివారం రాష్టవ్య్రాప్తంగా వృక్షమిత్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొక్కలు నాటటంతో పాటు వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)పై సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు.

08/21/2018 - 04:38

అమరావతి, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సంస్థ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, తదితరులు ఉండవల్లి గ్రీవెన్స్‌హాలులో సోమవారం గజమాలతో సత్కరించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్బడిన తర్వాత నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ద్వారా పేద బ్రాహ్మణులకు చేయూతనందించటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

08/21/2018 - 04:36

విజయవాడ(బెంజిసర్కిల్), ఆగస్టు 20: కాపులు, బలిజలను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతో అభినందనీయమని కాపు ఫెడరేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినందుకు సీఎం చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా సోమవారం కలిసిన కాపు ఫెడరేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

08/21/2018 - 04:33

విజయవాడ, ఆగస్టు 20: నిధుల కొరత, ఇతర కారణాల వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణం మందకొడిగా సాగుతోంది. గత మూడు సంవత్సరాలతో పోలిస్తే, ఈ ఏడాది ఎక్కువగానే నిర్మించినప్పటికీ, లక్ష్యాలను సాధించడంలో ఆశించిన మేర పురోగతి లేదు. పేదల సొంతింటి కలలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. 2019 నాటికి 19 లక్షల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

08/21/2018 - 04:31

అమరావతి, ఆగస్టు 20: భారీ వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమ్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అయింది.. ఇదొక జాతీయ విపత్తు.. సామాజిక బాధ్యతతో అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

08/21/2018 - 04:30

విజయపురిసౌత్, ఆగస్టు 20: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు 1,63,497 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రెండు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేయటంతోపాటు 5 క్రస్ట్‌గేట్లను ఎత్తి సాగర్ జలాశయానికి 2,08,554 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

08/21/2018 - 04:30

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 20: వడ్డీ వ్యాపారులకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూ అప్పుల ఊబిలోకి దింపుతున్న సీఎం చంద్రబాబు చర్యలు హేయమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి అమరావతిని నిర్మించడం సిగ్గుచేటే కాకుండా ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టేనని ధ్వజమెత్తారు.

08/21/2018 - 04:30

అమరావతి, ఆగస్టు 20: కేరళ వరదబాధితులకు ఏపీ ఎన్జీవో సంఘం రూ 20 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఉండవల్లి ప్రజావేదిక ప్రాంగణంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎన్జీవో నేతలు అశోక్‌బాబు, జోసఫ్ సుధీర్ తదితరుల ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు కలిసి కేరళ వరద బాధితులకు తమ సంఘం తరుపున రూ 20 కోట్ల విరాళాన్ని అందించాలని నిర్ణయించినట్లు వివరించారు.

08/21/2018 - 04:29

తిరుపతి, ఆగస్టు 20: ప్రజల్లో భక్త్భివం, ధార్మికతను మరింత పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలకు టీటీడీ ఆధ్యాత్మిక పుస్తకాలను అందించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ధర్మకర్తల మండలికి సమర్పించాలని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.

08/21/2018 - 04:28

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు మీటరు లోతులోనే అందుబాటులో ఉన్నాయి. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా భూగర్భ జలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవటంతో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.

Pages