S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/21/2018 - 04:28

అమరావతి, ఆగస్టు 20: కేరళ వరద బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. సోమవారం కేరళ సీఎం విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితులపై ఆరా తీశారు. సహాయ పునరావాస చర్యలపై కేరళ సీఎంను చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వం తరుపున ఇప్పటికే రూ. 10 కోట్లు విరాళాన్ని ప్రకటించామని, ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం, ఎన్జీవో సంఘాలు స్పందించాయని తెలిపారు.

08/21/2018 - 04:21

అమరావతి, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల్లో మరోసారి వర్షపు నీరు లీకులు ఏర్పడ్డాయి. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మంత్రుల చాంబర్లలోని సీలింగ్ పెచ్చులు ఊడిపడటంతో విధులకు ఆటంకాలు ఎదురయ్యాయి. సచివాలయంలోని నాలుగోబ్లాక్ మొదటి అంతస్తులో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్‌నాథ్‌రెడ్డి చాంబర్లలోకి వర్షపునీరు చేరడంతో పాటు పైకప్పు సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి.

08/21/2018 - 04:18

విజయవాడ, ఆగస్టు 20: స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ చేపట్టిన స్మార్ట్ గ్రామాల అభివృద్ధి పనుల్లో పంచాయతీరాజ్ శాఖ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ బోర్డు సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ పనులు చేపట్టాకే, ఇతర శాఖల పనులు చేపట్టాలని ఆదేశించారు.

08/21/2018 - 04:16

అమరావతి, ఆగస్టు 20: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా చేపట్టిన కార్యాచరణతో సాగునీటి రంగంలో కొత్త ఆశలు చిగురించాయని, రెండుకోట్ల ఎకరాలకు నీరందించే లక్ష్యానికి మార్గం సుగమం అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అన్ని ప్రాజెక్టుల ఇంజనీర్లు, అధికారులు ఈ దిశగా చొరవ తీసుకుని త్వరగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని సూచించారు.

08/21/2018 - 04:15

విజయవాడ, ఆగస్టు 20: మహిళల హక్కు కోసం... సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య భౌతికకాయానికి సోమవారం మధ్యాహ్నం వందలాది అభిమానులు, బంధుమిత్రులు అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. బెంజిసర్కిల్‌లోని వాసవీ మహిళ మండలి నుంచి రామలింగేశ్వర నగర్‌లోని రుద్రభూమి వరకు అంతిమయాత్ర సాగింది.

08/21/2018 - 04:14

విజయవాడ, ఆగస్టు 20: వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్యోగ సంఘాలు పోటీ పడుతున్నాయి. ఏపీ ఎన్జీవో సంఘం తరపున, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తరపున జేఏసీ అధ్యక్షుడు అశోక్ బాబు 20 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఏపీ జేఏసీ అమరావతి తరపున చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు 80 కోట్ల రూపాయలు ప్రకటించారు.

08/21/2018 - 03:35

ఏలూరు, ఆగస్టు 20: ఏకథాటిగా రోజుల తరబడి కురుస్తున్న భారీవర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసినా నీటమునిగిన రహదారులు, మోకాలి నీటిలో మునిగిపోయిన పంటపొలాలే దర్శనమిస్తున్నాయి. దీనికితోడు పశ్చిమ ఏజన్సీలో పరిస్థితి మరింత భయానకంగా మారుతూ వస్తోంది. ప్రధానంగా గోదావరి ఉద్ధృతి ఇటీవలకాలంలో ఏనాడు లేనిరీతిలో పెరిగిపోవటంతో పెద్దసమస్యగా మారిపోయింది.

08/21/2018 - 03:34

విజయవాడ, ఆగస్టు 20: గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా కృష్ణాజిల్లాలో వాగులు వంకలు గత పదేళ్లలో లేనివిధంగా పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా మొత్తం 70గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదలుతున్నారు.

08/21/2018 - 03:30

కర్నూలు సిటీ, ఆగస్టు 20: అర్హులైన 54 లక్షల మంది రైతులకు రూ. 24,500 కోట్ల రుణమాఫీ చేసి దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు.

08/18/2018 - 05:51

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఆగస్టు 17: రాను న్న దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నుండి నిధులను తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని విజయవాడ దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ వెల్లడించారు. ఈవోగా ఆమె శుక్రవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు.

Pages