S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/28/2018 - 04:05

అమరావతి, జూలై 27: త్వరలో ప్రభుత్వం 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుందని శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో పదిలక్షల మందికి ఉపాధి కల్పించిందని, మరో పదిలక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పించాలనే యోచనతో ఉందన్నారు.

07/28/2018 - 04:01

అమరావతి, జూలై 27: రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ సమాఖ్యల సహాయకులు, రిసోర్స్ పర్సన్లకు ప్రతినెలా రూ 5వేల ఆదాయాన్ని అందించేలా కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వీరికి త్వరలో ప్రభుత్వపరంగా నెలకు రూ 3వేల గౌరవ వేతనం అందిస్తామని ప్రకటించారు.

07/28/2018 - 03:59

పాల్వంచ, జూలై 27: రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పతనం ఖాయమని మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవభారత్ వెంచర్స్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు, తర్వాత కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు.

07/28/2018 - 03:56

విశాఖపట్నం, జూలై 27: రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు అందుతున్న నిత్యావసర సరకుల సరఫరాలో డీలర్లు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల రేషన్ డీలర్ల సదస్సు విశాఖలో శుక్రవారం జరిగింది.

07/28/2018 - 03:53

శ్రీకాకుళం, జూలై 27: టీడీపీయేతర పార్టీలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తే టీడీపీ భయపడిపోదని, అవగాహన లేని ‘జన’సైనికులు, అభివృద్ధికి మోకాలడ్డే వైసీపీ, యూటర్న్ తీసుకుని ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలు బలహీనులని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు.

07/28/2018 - 03:50

అమరావతి: వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తాం.. భావితరాల భవిష్యత్ కోసం టీడీపీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కష్టకాలంలో ఉన్న అమెరికాను ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అభివృద్ధిలో తీర్చిదిద్దారు.. ఆయన నాలుగు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ముఖ్యమంత్రి వివరించారు.

07/28/2018 - 03:46

రాజమహేంద్రవరం, జూలై 27: ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్-2018 తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ.90 వేల నగదు బహుమతితో పాటు పతకాలు ప్రదానం చేస్తారు.

07/28/2018 - 03:45

విశాఖపట్నం, జూలై 27: కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. రుతుపవనాల ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 30 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

07/28/2018 - 03:49

అమరావతి, జూలై 27: గురుపౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బ్రాహ్మణ ప్రముఖులు, వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ప్రతినిధులు, పంచాంగకర్తలు శుక్రవారం గ్రీవెన్స్‌సెల్‌లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరికీ ప్రభుత్వపరంగా ప్రయోజనాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

07/28/2018 - 03:42

అమరావతి, జూలై 27: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం తనను కలిసిన స్పిన్నింగ్ మిల్లుల యజమానులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్పిన్నింగ్ పరిశ్రమకు సబ్సిడీలిస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి.. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. వారంలో స్పిన్నింగ్ మిల్లులకు సబ్సిడీ అందజేస్తామని వెల్లడించారు.

Pages