S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/28/2018 - 03:39

అమరావతి, జూలై 27: రాజధాని అమరావతిలో శాసనసభ, సచివాలయ భవనాల డిజైన్లలో స్వల్ప మార్పులు చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. శాసనసభ భవన ఆకృతులకు సంబంధించి డిజైన్ రూపొందించిన నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులతో అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం స్పీకర్ సమావేశమయ్యారు. భవన ఆకృతులలో చిన్నచిన్న మార్పులు సూచించారు. శాసనసభ, సచివాలయ విధులకు అనుకూలంగా భవన ఆకృతులు రూపుదిద్దుకోవాలని సూచించారు.

07/28/2018 - 00:20

అమరావతి, జూలై 27: తెలుగుదేశం పార్టీలో ఇటీవల కొందరు నాయకులు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో నిర్వహించిన పార్టీనేతల సమావేశంలో ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, పెందుర్తి వెంకటేష్‌పై వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదన్నారు.

07/28/2018 - 00:19

విజయవాడ, జూలై 27: ఏపీఎస్ ఆర్టీసీలో ఆగస్టు 9న జరుగుతున్న గుర్తింపు సంఘాల ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్(ఈయు) కూటమిని గెలిపిస్తే ఉద్యోగులకు 50% పిట్‌మెంట్ సాధించే దిశగా కృషి చేయడమే కాకుండా, ఉద్యోగుల పదవి విరమణ వయస్సును కూడా 58 నుండి 60 ఏళ్లు పెంచేందుకు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించేందుకు పోరాడతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర నాయకులు వై.వి.రావు, కె.పద్మాకర్, పి.సుబ్ర

07/28/2018 - 00:19

నెల్లూరు, జూలై 27: వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని భూమి లేని పేదలందరికి 3 ఎకరాలు సాగుభూమి అందజేయాలని వామపక్షాల రాష్ట్ర కార్యర్శులు పి మధు, కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కేంద్రంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో శుక్రవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ కార్మికుల రాష్ట్ర సదస్సులో వారు పాల్గొన్నారు.

07/27/2018 - 23:54

గుంటూరు, జూలై 27: విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా కేంద్రం చేసిన మోసం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు భారతీయ జనతాపార్టీ కుట్రపన్నుతుందని ఒంగోలు ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధనరావు ధ్వజమెత్తారు.

07/27/2018 - 23:52

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో తాజాగా ప్రారంభమైన అన్న క్యాంటీన్‌లు అన్ని ఎంతో దిగ్విజయంగా నడుస్తున్నాయని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం... భోజనం అందిస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించామన్నారు.

07/27/2018 - 23:52

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో పని చేస్తున్న ఇన్ సర్వీస్ పీఈటీలకు (యుజీపీ, ఈడీ అర్హతతో పని చేస్తున్న వారు) 2018-2020 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల కాలపరిమితి ఉన్న బ్యాచలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు చేయడానికి అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధారాణి శుక్రవారం జీఓ విడుదల చేశారు.

07/27/2018 - 23:51

విజయవాడ, జూలై 27: ప్రతిపక్షనేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎంత త్వరగా తమ నోరును అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువమంత్రి నారా లోకేష్‌పై వారు చేస్తున్న అవినీతి అరోపణలను తక్షణమే నిరూపించాలంటూ సవాల్ చేశారు.

07/27/2018 - 23:51

తిరుపతి, జూలై 27: ఆగస్టు 15వ తేదీలోగా తమ సమస్యలు పరిష్కరించకుంటే 16వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఉద్యోగ, కార్మికులు, కళాకారులు స్పష్టం చేశారు. టీటీడీ యాజమాన్య వైఖరికి నిరసనగా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు దశలవారీగా పోరాట బాట పట్టాలని నిర్ణయించాయి.

07/27/2018 - 05:08

కొవ్వూరు, జూలై 26: గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించారు. గ్రామమంతా కలియదిరిగి, మహిళలు, వృద్ధుల సమస్యలు తెలుసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన ఆయన మొత్తంగా గ్రామాభివృద్ధిపై సంతృప్తి వ్యక్తంచేశారు.

Pages