S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/27/2018 - 05:06

విజయవాడ, జూలై 26: ప్రత్యాహ్నయ వ్యాపార పద్ధతులు, సృజనాత్మకతో కూడిన వనరుల వినియోగం, స్థిరమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన సాంకేతికతలు, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణల సందర్శన వేదికగా విజయవాడ నిలవనుంది. నవ్యాంధ్రలో తొలిసారిగా మినీ మేకర్ ఫెయిర్ నిర్వహించాలని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సంకల్పించింది.

07/27/2018 - 05:05

విజయవాడ, జూలై 26: జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని అడ్డుకుని చరిత్ర హీనులుగా నిలవద్దని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే వైసీపీ సభ్యులు ఇంట్లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

07/27/2018 - 05:05

అమరావతి, జూలై 26: వరుస ఎన్‌కౌంటర్లతో నేతలు, కేడర్‌ను కోల్పోతున్న మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణలో పడ్డట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కేడర్ పునరుద్ధరణ, సైద్ధాంతిక విశే్లషణ, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయటంతో పాటు మిలిటెంట్ పోరాటాలను తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్‌పై యుద్ధంలో గ్రీన్‌హంట్ ఆపరేషన్‌తో పాటు మిషన్ 2016, 17, 18 అమలు చేస్తున్నాయి.

07/27/2018 - 05:04

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూలై 26: చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలై వివిధ ఫల పుష్పాదులతోపాటు కూరగాయలతో అలంకృతురాలైన శాకంబరీదేవిని దర్శించుకోవటానికి భక్తులు ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. ఎంతోవిశిష్టతమైన అలంకారంతో ఉన్న ఈ చల్లని తల్లిని దర్శిస్తే మంచి జరుగుతుదన్న నమ్మకంతో గురువారం ఉదయం నుండే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు.

07/27/2018 - 04:55

విజయనగరం, జూలై 26: జిల్లాలో బుడగ, బేడ జంగాల మూలాలు తెలుసుకునేందుకు ఏకసభ్య కమిషన్ జిల్లాలో పర్యటించింది. గురువారం ఏకసభ్య కమిషన్ చైర్మన్ జేసీ శర్మ ఆధ్వర్యంలో విజయనగరం మండలం బియ్యాలపేట, నెల్లిమర్ల మండలం సతివాడలో పర్యటించి బుడగ జంగాలు, బేడ జంగాల మూలాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో బుడగ జంగాల వారు ఉన్నారా? వారి ఆహార అలవాట్లు, ఎస్సీలు కానివారు ఎస్సీ సర్ట్ఫికెట్ పొందుతున్నారా?

07/27/2018 - 01:09

విశాఖపట్నం: రాష్ట్రంలోని 14 యూనివర్శిటీల్లో పదిహేనేళ్ల నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామాకాలు జరగడం లేదు. దేశంలోనే అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఒకటైన ఆంధ్రా యూనివర్శిటీలో తగినంత ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యా బోధన అంతంతమాత్రంగా జరుగుతోంది. రాష్ట్రంలోని ఏ యూనివర్శిటీలోనూ నాణ్యమైన విద్య అందకపోవడానికి ఆచార్యులు లేకపోవడమే ప్రధాన కారణం.

07/27/2018 - 00:11

విజయవాడ, జూలై 26: నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించిన ఐఎన్‌ఎస్ విరాట్ విమాన వాహన నౌకను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉంది. డీపీఆర్ అందచేసి ఆరు నెలలు కావస్తున్నా, ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. దాదాపు భారత నౌకాదళానికి 30 సంవత్సరాలకు పైగా సేవలు అందించిన ఐఎన్‌ఎస్ విరాట్‌ను గత ఏడాది మార్చిలో నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించారు.

07/27/2018 - 00:10

రేణిగుంట, జూలై 26: మీరెంత.. మీ ఉద్యోగాలెంత... ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా... మీ కథ చూస్తా... అంటూ చిత్తూరు జిల్లా జేసీ గిరీషా, రేణిగుంట తహశీల్దార్ నరసింహులు నాయుడుపై నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చిందులేసిన సంఘటన గురువారం సాయంత్రం 5.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

07/27/2018 - 00:09

గుంటూరు, జూలై 26: ప్రజా రాజధాని అమరావతిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ యత్నిస్తున్నారని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.

07/27/2018 - 00:09

గుంటూరు, జూలై 26: నవ్యాంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, రైతులను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు బి జయనాగేశ్వరరెడ్డి, ఏలూరు సాంబశివరావు ధ్వజమెత్తారు.

Pages