S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/02/2016 - 18:06

గుంటూరు: ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కుంటలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పదేళ్ల లోపు నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు అందులో మునిగి మృతిచెందారు.

07/02/2016 - 11:42

విశాఖ: ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఇక్కడికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం నగరంలోని ఓ హోటల్‌లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగే సమావేశంలోను, నౌకాదళ అధికారుల సమావేశంలోనూ పాల్గొంటారు. తర్వాత బీచ్‌రోడ్డులో బే మారథాన్‌ను ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి విజయవాడ చేరుకుంటారు.

07/02/2016 - 11:39

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు బయలుదేరారు. సూళ్లూరుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బళ రాజిరెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొంటారు.

07/02/2016 - 11:36

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

07/02/2016 - 08:31

విజయవాడ, జూలై 1: రంజాన్ పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖల మంత్రి డా.పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. స్థానిక చిట్టినగర్‌లోని ఈద్‌గాహ్ షాదీఖానాలో శుక్రవారం ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి అందజేవారు.

07/02/2016 - 08:30

రాజమహేంద్రవరం, జూలై 1: తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజిపై దొంగలు పడ్డారు. బ్యారేజీ నిర్వహణలో కీలకమైన బ్రేక్ కాయల్స్ మాయమయ్యాయి. ఒక్కొక్కటి సుమారు రూ.10 వేలు విలువచేసే మొత్తం 140 కాయల్స్ మాయమయ్యాయి. గేట్ల ఎత్తివేతలో ఈ బ్రేక్ కాయల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

07/02/2016 - 08:29

విజయవాడ, జూలై 1: రాష్ట్రాన్ని సంపూర్ణ కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు వేయిస్తే నీరుపడక, వర్షాలు కురవక, పంట పొలాలు ఎండిపోయి పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూగర్భ జలాల గురించి గతంలో ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

07/02/2016 - 04:54

విజయవాడ, జూలై 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రోజు రోజుకూ తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఖండించారు. చైనా పర్యటన ముగించుకుని శుక్రవారం విజయవాడ వచ్చిన చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.

07/02/2016 - 03:39

విజయవాడ, జూలై 1: రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎపిని భ్రష్టు పట్టించిందని అన్నారు. ఎపి పెట్టుబడిదారులంటే అవినీతిపరులన్న ముద్ర వేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

07/02/2016 - 03:38

విజయవాడ, జూలై 1: రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించే సాయం పెద్దగా లేదని తేలిపోయింది. అమరావతికోసం కేంద్రం కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తానందని శుక్రవారం విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన 1000 కోట్లు కూడా అందులో భాగమేనని ఆయన అన్నారు.

Pages