S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/24/2018 - 01:27

అమరావతి, జూలై 23: ఈ దేశంలో ఎవరి మీదా అలగలేం.. అలిగినా ప్రయోజనం ఉండదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్న అనంతరం సచివాలయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారని మీడియా ప్రశ్నించగా ‘ఏం మాట్లాడానో చెప్పను’ అని స్పష్టం చేశారు.

07/23/2018 - 23:46

విజయవాడ, జూలై 23: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఐ, సీపీఎం పిలుపు మేరకు 13 జిల్లాల్లోని పలు కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, ధర్నాల వంటి ఆందోళనలు జయప్రదంగా జరిగాయి.

07/23/2018 - 23:45

ఏలూరు, జూలై 23: పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అమలుతీరుపై మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

07/23/2018 - 23:45

విశాఖపట్నం, జూలై 23: ఎన్నికలకు ఆట్టే సమయం లేకపోవడంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. ప్రత్యేక హోదాను సాకుగా చూపి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అధికార టీడీపీ ఓపక్క ప్రతిపక్షాల మాటల తూటాలకు బదులిస్తూనే, చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది.

07/23/2018 - 23:44

నెల్లూరు, జూలై 23: రాష్ట్ర బంద్‌కు ప్రతిపక్షనేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునివ్వడం అవివేక చర్య అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరులో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మనం బంద్ చేసుకుంటే మనకే నష్టమన్నారు.

07/23/2018 - 23:43

విజయవాడ, జూలై 23: రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఆగస్టు 7వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే సమ్మె చేపడతామని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సంఘం కన్వీనర్ శివగోపాల్ మిశ్రా ప్రకటించారు.

07/23/2018 - 23:43

అమరావతి, జూలై 23: గ్రామ సమాఖ్య సహాయకులకు గౌరవవేతనం అమలు చేయాలని యానిమేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. సోమవారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాలులో సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విధి, విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెలకు రూ 3వేలు గౌరవ వేతనం అందించేలా చర్యలు తీసుకోవాలని సానుకూలంగా స్పందించారు.

07/24/2018 - 01:38

సామర్లకోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంలక్పయాత్ర 219వ రోజైన సోమవారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో కొనసాగింది. పాదయాత్రగా వచ్చిన జగన్‌కు సామర్లకోటలో జనం నీరాజనాలు పలికారు. సోమవారం ఉదయం సామర్లకోట మండలం ఉండూరు గ్రామం నుంచి యాత్ర ప్రారంభమయ్యింది. స్థానిక అయిదు తూముల మీదుగా రైలుగేటు నుంచి సామర్లకోట పట్టణం లోనికి యాత్ర చేరుకుంది.

07/23/2018 - 04:10

బళ్లారి, జూలై 22 : తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరిగి తుంగభద్ర జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం గరిష్ఠ స్థాయి 1633 అడుగులు కాగా ఆదివారం నాటికి 1631.29 అడుగులకు చేరుకుంది. ఇక ఇన్‌ఫ్లో 52,083 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 49,240క్యూసెక్కులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 94.39 టీఎంసీలకు చేరింది.

07/23/2018 - 04:09

కర్నూలు సిటీ, జూలై 22 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వల్లే రాష్ట్ర విభజన జరిగిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కోట్ల సూర్య పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

Pages