S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/21/2018 - 05:44

తిరుపతి, జూలై 20: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎం ఎస్ ఎం ఈ పార్కులను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తిరుపతిలో త్వరలోనే పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సును నిర్వహించనున్నామని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి మానస సరోవర్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఐఐ తిరుపతి జోన్ సదస్సులో పరిశ్రమల శాఖామంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

07/20/2018 - 06:25

విజయవాడ, జూలై 19: భవిష్యత్తు నాలెడ్డి ఎకానమీదేనని, అందుకే ఐటీ రివల్యూషన్ ఫలితాలు అందుకుని ముందుకెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. భవిష్యత్తులో సేవల్లోనే ప్రభుత్వం కనిపిస్తుందని, పరిపాలనలో ఇదో విప్లవమని అభివర్ణించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో ఈ-ప్రగతి కోర్ పోర్టల్‌ను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

07/20/2018 - 06:14

న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ, లోక్‌సభ ఎన్నికలు జరిగే సమయానికి అనుహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని మాజీ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ఏపీ జర్నలిస్టుల సంఘం గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సబ్బం మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ శాసన సభకు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

07/20/2018 - 06:14

విశాఖపట్నం, జూలై 19: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఇకపై విద్యుత్‌కు చింతలేదు. అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో సిద్ధంగా ఉంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఎక్కడైనా పరిశ్రమల స్థాపించాలంటే ముందుగా అవసరమయ్యేది విద్యుత్. గృహ అవసరాలకు విద్యుత్ వాడకం ఎక్కువుగా ఉంటోంది.

07/20/2018 - 06:13

విశాఖపట్నం, జూలై 19: విశాఖ ఏజెన్సీలోని గిరిజనులను అంటు వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. గతంలో విష జ్వరాలతో పెద్ద సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మలేరియాతో పదుల సంఖ్యలో గిరిజనులు మరణించారు. మలేరియా, విష జ్వరాలు తగ్గుముఖం పట్టాయనుకుంటే, డెంగ్యూ వ్యాధి ఈ ఏడాది ఏజెన్సీలో రిపోర్ట్ అయింది. సాధారణంగా ఈ సీజన్‌లో మలేరియా వ్యాధి ఏజెన్సీని వణికిస్తుంటుంది.

07/20/2018 - 06:04

కాకినాడ, జూలై 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో సాగిస్తున్న పాదయాత్ర గురువారం గంటలోనే ముగిసింది. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని మాధవనగర్ నుండి ఉదయం 8.30 గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభించారు. జేఎన్‌టియూకే మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండు వరకు ఒక కిలోమీటరు మేర నడిచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర పూర్తిచేశారు.

07/17/2018 - 23:52

తిరుపతి, జూలై 17: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతించేది లేదని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సీఎం చంద్రబాబునాయుడు ఆదేశంతో టీటీడీ యాజమాన్యం పునరాలోచనలో పడింది.

07/17/2018 - 06:05

విశాఖపట్నం, జూలై 16: రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం కొత్త రక్తాన్ని ఎక్కించింది. గత ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతుకులాడిన బీజేపీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కింగ్‌మేకర్ కావాలని భావిస్తోంది.

07/17/2018 - 06:04

అమరావతి, జూలై 16: రాజధాని అమరావతిని అంతర్జాతీయస్థాయిలో ఆవిష్కరణల కేంద్రంగా తీర్చి దిద్దాలనేది ప్రభుత్వలక్ష్యమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

07/17/2018 - 06:03

అమరావతి, జూలై 16: విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) ఏర్పాటులో పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఎవరికీ నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలశాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ అన్నారు. ఆసియన్ డవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన కారిడార్ ఏర్పాటుపై కీలకోపన్యాసం చేశారు.

Pages